Viral Video | తమ గమ్యస్థానాలను త్వరగా చేరుకోవడానికి, కార్యాలయాలకు సమయానికి చేరుకోవడానికి చాలా మంది బైక్ ట్యాక్సీని ఆశ్రయిస్తుంటారు. ఎందుకంటే బైక్‌పై వెళ్తే.. వీలైనంత త్వరగా తాము చేరాల్సిన ప్రదేశానికి చేరుకోవచ్చని. అంతేకాకుండా ట్రాఫిక్ నుంచి తప్పించుకోవచ్చనే ఉద్దేశంతో బైక్ ట్యాక్సీని చాలా మంది ఆశ్రయిస్తుంటారు. అయితే ఓ వాహనదారుడికి వింత అనుభవం ఎదురైంది.
పెట్రోల్ అయిపోయింది కాస్త బంక్ దాకా నడవాలని సదరు ప్రయాణికుడిని కోరగా, అందుకు తిరస్కరించాడు. దీంతో ఆ బైక్ వాలా.. కస్టమర్‌ను అలాగే కూర్చోబెట్టుకుని బండిని తోసుకుంటూ పెట్రోల్ బంక్ దాకా వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకున్నట్లు తెలిసింది.
బైక్ ట్యాక్సీ బుక్ చేసుకున్న ప్రయాణికుడి తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. కనీసం ఆ డ్రైవర్‌పై సానుభూతి కూడా చూపలేకపోయాడని ధ్వజమెత్తుతున్నారు. మరి ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తారా? అంటూ ఫైర్ అవుతున్నారు నెటిజన్లు.
A #Rapido bike driver in #Hyderabad was forced to push his bike with a customer on it after he refused to get down when his vehicle ran out of petrol.@rapidobikeapp @newstapTweets pic.twitter.com/xs58hmM1bZ
— Anusha Puppala (@anusha_puppala) February 12, 2024