అంబర్పేట, జూన్ 21: గోల్నాక డివిజన్, ఖాద్రిబాగ్..కిషోర్కుంజ్ స్కూల్ లేన్ ప్రాంతంలో 15 రోజులుగా నల్లాల్లో డ్రైనేజీ నీరు కలిసి వస్తున్నది. దీంతో తాగునీరు తాగలేకపోతున్నామని బస్తీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజు విడిచి రోజు వచ్చే మంచినీటి నల్లాలో డ్రైనేజీ మురుగు వస్తున్నదని వాపోతున్నారు. దుర్వాసనతో నల్లగా నీరు వస్తున్నదని, వాటిని తాగలేకపోతున్నామన్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదని చెప్పారు. డబ్బులు పెట్టి నీటి క్యాన్లు కోనుక్కోవాల్సిన దుస్థితి దాపురించిందని చెప్పారు.