Nizampet | దుండిగల్,మార్చి29: నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 15,16వ డివిజన్ల లోని రాజీవ్ గాంధీ నగర్ లో పలు ఇండ్లకు శనివారం స్థానికులు ఆస్తి పన్ను చెల్లించడం లేదంటూ మున్సిపల్ అధికారులు ఏకంగా డ్రైనేజీ పైప్లైన్ మూసివేశారు. దీంతో స్థానికులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పన్నులు కట్టకుంటే ప్రజలకు అందాల్సిన కనీస వసతులను నిలిపివేస్తారా…? ఇదేం తీరు అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఈ విషయమై నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సాబీర్ఆలీని వివరణ కోరగా… గడిచిన నెల రోజులుగా పనులు చెల్లించాలని వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నామని, ఆటోలను ఏర్పాటు చేసి పన్నులు చెల్లించాలని కోరుతున్నా.. ఎవరూ స్పందించడం లేదన్నారు. ప్రభుత్వ విధానం ప్రకారమే తాము నడుచుకుంటున్నామని పేర్కొన్నారు.