సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని మారేడ్‌పల్లికి చెందిన డాక్టర్ శోభాదేవి నక్కన 68 ఏండ్ల వయస్సులోనూ అరుదైన ఫీట్ సాధించింది. విజయవంతంగా ఎవరెస్ట్ బేస్ క్యాంపును అధిరోహించిన మిసెస్ ఇండియా-2019, భారతీయ మహిళా డాక్టర్‌గా చరిత్ర లిఖించింది.
యువతకు స్ఫూర్తిగా నిలిచింది. నగరానికి చెందిన డాక్టర్ శోభాదేవి నక్కన ఉబకాయం, మధుమేహ వ్యాధులను నియంత్రించేందుకు సాహసయాత్రను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. షెర్పాలు ఎవరెస్ట్‌ను ట్రెక్కింగ్ చేయడంలో కీలకంగా మారుతారని, వారి సంక్షేమం కోసం రూ.75వేలు అందించినట్లు తెలిపారు.