కాచిగూడ, జూలై 15: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని డివిజన్లలో ఉచిత మెడికల్ ఫిజియోథెరపీ సెంటర్ల (Physiotherapy centers)ఏర్పాటుకు స్థానిక కార్పొరేటర్లు పూర్తిస్థాయిలో సహకరించాలని హ్యుమానిటీ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ కొండ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. మంగళవారం కాచిగూడ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు.
గ్రేటర్ పరిధిలోని మురికివాడ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద ప్రజలకు ప్రతివారం ఉచితంగా ఫిజియోథెరపీ సేవలతో పాటు ఆధునిక వైద్యాన్ని అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అందుకు స్థానిక కార్పొరేటర్ సహకరించాలని కోరారు. అదేవిధంగా పలు స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ సెంటర్ల ఏర్పాటుకు సహకరించాలన్నారు. సేవా భావంతో సెంటర్ల ఏర్పాటుకు 9949238492లో సంప్రదించాలని ఆయన కోరారు.