ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 5: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బషీర్‌బాగ్ పీజీ లా కళాశాల (Bashirbagh PG Law College) ప్రిన్సిపల్‌గా( Principal )డాక్టర్ గుమ్మడి అనురాధ(Dr. Gummadi Anuradha) నియమితులయ్యారు. ఈ మేరకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ ఉత్తర్వులు జారీ చేయగా, వీసీ ప్రొఫెసర్ రవీందర్ నియామక పత్రాన్ని అనురాధకు అందజేశారు.
ఖమ్మం జిల్లా ఇల్లందుకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మడి నర్సయ్య కూతురైన అనురాధ ఆయన బాటలోనే పయనిస్తూ రెండో సారి ప్రిన్సిపల్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమెను పలువురు అధ్యాపకులు, అధికారులు, విద్యార్థి నాయకులు అభినందించారు.