వెస్ట్ మారేడ్‌పల్లిలో లబ్ధిదారులకు అందజేయనున్న మంత్రి కేటీఆర్
పశు సంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
మారేడ్‌పల్లి, మార్చి 1: కంటోన్మెంట్ నియోజకవర్గం వెస్ట్ మారేడ్‌పల్లిలో 5.8 ఎకరాల విస్తీర్ణంలో రూ.36. 27 కోట్ల వ్యయంతో నూతనంగా 468 డబుల్ బెడ్ రూం ఇండ్లను ఈ నెల 3వ తేదీన ఉదయం 9:30 గం టలకు మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రా మారావు ప్రారంభిస్తారని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం వెల్లడించారు. 468 ఇండ్ల నిర్మాణం కోసం 37.76 కోట్లను ఖర్చు చేయగా, రూ. 3.51 కోట్ల వ్యయంతో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యా లు కల్పిండంతో పాటు, మంచినీటి సౌకర్యం కోసం 50 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన నాలుగు సంపులను నిర్మించినట్టు తెలిపారు. హౌ జింగ్ బోర్డుకు చెందిన ఈ స్థలంలో అనే క మంది నిరుపేదలు సరైన సౌకర్యాలు లేక, ఇరుకైన ఇండ్లలో జీవనం సాగించే వారని తెలిపారు. ఈ ప్రాంతంలోని పేద లు పడుతున్న ఇబ్బందులను తాను రా ష్ట్రం ఏర్పడిన కొత్తలో సీఎం కేసీఆర్ దృష్టి కి తీసుకెళ్లినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి చొరవతో ముందుగా హౌసింగ్ బోర్డుకు చెందిన ఈ స్థలాన్ని రెవె న్యూ శాఖకు బదిలీ చేసి లబ్ధిదారులకు పొసెషన్ సర్టిఫికెట్లను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. అ నంతరం, డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మా ణం చేపట్టి పూర్తి చేసినట్లు మంత్రి వెల్లడించారు. పేదలు అన్ని వసతులు, సౌకర్యాలు కలిగిన సొంత ఇంటిలో సంతోషంగా, ఎం తో గొప్పగా బతకాలనేది ముఖ్యమంత్రి లక్ష్యం అని చెప్పారు. ప్రభుత్వమే పూర్తి ఖర్చుతో ఇండ్ల ను నిర్మించి లబ్ధిదారులకు అందజేసే మహోన్నత కార్యక్రమం దేశంలో ఎక్కడా అమలు కావట్లేదని అన్నారు.