
సిటీబ్యూరో, సెప్టెంబరు 21 (నమస్తే తెలంగాణ) : విశాలంగా చక్కటి సదుపాయాలతో ప్రభుత్వం నిర్మించి ఇస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లు విడుతల వారీగా అందుబాటులోకి వస్తున్నాయి. సికింద్రాబాద్ కట్టమైసమ్మ సిల్వర్ కాంపౌండ్‌లో నిర్మించిన 168 డబు ల్ బెడ్రూం ఇండ్లను డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు, మంత్రులు తలసాని, వేముల ప్రశాంత్‌రెడ్డి, మహమూద్‌అలీ, మల్లారెడ్డిలతో కలిసి పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ గురువారం ప్రారంభించనున్నారు. మురికివాడలు లేని భాగ్యనగరంగా మార్చేందుకు ప్రభుత్వం స్థానికులను ఒప్పించి చూడచక్కని ఇండ్లు నిర్మిస్తున్నది. కట్టమైసమ్మ సిల్వర్ కాంపౌండ్‌లో రూ.17.36 కోట్లతో 8 బ్లాకుల్లో 224 ‘డబుల్’ ఇండ్ల నిర్మా ణానికి 168 ఇండ్ల నిర్మాణం పూర్తయ్యింది.