శంషాబాద్ రూరల్, నవంబర్ 17: బీఆర్ఎస్తోనే ప్రజలందరికి న్యాయం జరుగుతుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ తెలిపారు. శుక్రవారం శంషాబాద్ మండలంలోని బీజేపీ పార్టీకి చెందిన జిల్లా నాయకుడు పాశం శ్రీధర్, నరేశ్, మహేశ్, సూర్యతో పాటు 200 మంది నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్తోనే ప్రజలందరికి న్యాయం జరుగుతుందని వివరించారు.
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రజల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి పథకాలు అమలు చేసి దేశంలోనే తెలంగాణను ఆదర్శంగా అభివృద్ధి చేశారని వివరించారు. రైతులకు రైతు బంధు, రైతు బీమా, మిషన్‌భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరుఅందించిన ఘతన సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు గణేశ్ గుప్తా, మున్సిపల్ చైర్పర్సన్ సుష్మారెడ్డి, వెంకటేశ్ గౌడ్, కొన్నమొల్ల శ్రీనివాస్‌లతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌ను గెలిపాంచాలి
శంషాబాద్ రూరల్, నవంబర్ 17: ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని శంషాబాద్ జడ్పీటీసీ నీరటి తన్విరాజు ప్రజలను కోరారు. శుక్రవారం మండలంలోని అలీకోల్తండా, ఎర్రకుంట తండాలల్లో మండల అధ్యక్షుడు కే.చంద్రారెడ్డి, ఎంపీపీ జయమ్మ, సర్పంచ్ రేణుకతో కలిసి ఎమ్మెల్యేకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నీలంనాయక్, నీరటి రాజుముదిరాజ్, మోహన్‌రావు, పీఏసీఎస్ చైర్మన్లు దవాణాకర్గౌడ్, బుర్కుంట సతీశ్, బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు హెమ్లానాయక్, గోపాల్‌నాయక్, మోహన్‌నాయక్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, సత్యనందంతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
బండ్లగూడ, నవంబర్ 17: ముఖ్యమంత్రి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి కారు గుర్తుకు ఓటు వేయాలని కార్పొరేటర్ అర్చన జయప్రకాశ్ ప్రజలను కోరారు. శుక్రవారం శివరాంపల్లిలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
మణికొండ, నవంబర్ 17: మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పంచవటికాలనీ, లక్ష్మీనగర్‌కాలనీ, హనుమాన్‌నగర్, ప్లెజెంట్వ్యాలీకాలనీల్లో శుక్రవారం మున్సిపల్ బీఆర్ఎస్ సమన్వయకర్త తలారి మల్లేశ్ ముదిరాజ్, ఫ్లోర్‌లీడర్ కె.రామకృష్ణారెడ్డి, పార్టీ అధ్యక్షుడు బి.శ్రీరాములు, రాష్ట్ర ట్రెడ్ యూనియన్ ఉపాధ్యక్షురాలు లక్ష్మీశ్రీ, కౌన్సిలర్లు శైలజ, కావ్య, వసంత్ చౌహాన్, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు రూపారెడ్డి, ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి, నాయకులు కుమార్, శ్రీకాంత్, గంగాధర్ ఆధ్వర్యంలో పలు వార్డుల్లో ఇంటింటా ప్రచారాలను ముమ్మరం చేస్తున్నారు.
రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ఉపాధ్యక్షురాలు లక్ష్మీశ్రీ, మణికొండ మున్సిపల్ మహిళావిభాగం అధక్షురాలు రూపారెడ్డి, ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఇంటింటా తిరుగుతూ ఉండమ్మా బొట్టు పెడతా అంటూ వినూత్న రీతిలో శుక్రవారం ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో గౌలిదొడ్డిలో మున్సిపల్ చైర్పర్సన్ రేఖాయాదగిరి, వట్టినాగులపల్లిలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు నాగేశ్‌యాదవ్, ఖానాపూర్ గ్రామంలో పార్టీ అధ్యక్షుడు ఆర్.నర్సింహ, గండిపేటలో కౌన్సిలర్లు విజిత ప్రశాంత్‌యాదవ్, సునీతాగణేశ్కుమార్, కోకాపేటలో కౌన్సిలర్ శివారెడ్డి, మంచిరేవులలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ప్రవీణ్‌యాదవ్, నాయకులు పొన్న రమేశ్, మహేశ్వర్‌రెడ్డి, విష్ణువర్ణన్రెడ్డి, నార్సింగిలో మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటేశ్‌యాదవ్ నేతృత్వంలో ఎక్కడికక్కడా ఇంటింటా ప్రచారాలను శుక్రవారం నిర్వహించారు.
వ్యవసాయ యూనివర్సిటీ, నవంబర్ 17: సులేమాన్‌నగర్ డివిజన్లోని సులేమాన్‌నగర్, ఎంఎం పహడీ తదితర కాలనీల్లో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు షేక్ నయీముద్దీన్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో సయ్యద్, వషీమ్, షేక్ సమీర్, వాజీద్, సురేశ్, నవీన్ కుమార్, సన్నామేడం, సైనాజ్, భానూమేడం, నషీన్, సలీమా, ఫర్జానా, రషీద, తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ఎండీ ముఖ్రమ్ ఖాన్ ఆధ్వర్యంలో ఆయా కాలనీల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు అహ్మద్ పటేల్, అషీఫ్, అమర్హాజీ, అల్లావుద్దీన్ అఫన్, శంకర్, సింగ్, పవన్‌కుమార్, హుస్సేన్బాయ్, హర్షద్ తదితరులు పాల్గొన్నారు.
అత్తాపూర్, నవంబర్ 17: అత్తాపూర్ డివిజన్ పరిధిలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముమ్మర ప్రచారాన్ని చేపట్టారు. అత్తాపూర్ డివిజన్ హైదర్‌గూడ, కృష్ణానగర్, శివానగర్ తదితర ప్రాంతాల్లో ఇంటింటికి తిరుగుతూ ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మిద్దెల సురేందర్‌రెడ్డి, అమరేందర్, శ్రీరామ్‌రెడ్డి, చిన్న, రవీంద్రగౌడ్, సురేశ్‌రెడ్డి, శేఖర్, శ్రీనివాస్‌గౌడ్, శేఖర్, బాల్‌రెడ్డి, సంతోష్, హరి, చిత్తారీ పాల్గొన్నారు.