మాదాపూర్, మార్చ్ 27: మాదాపూర్ లోని నోవాటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్, హెచ్ఐసీసీ సంయుక్తంగా మహావీర్ హాస్పిటల్, నిజాం మెడికల్ సైన్సెస్ ఇనిస్టిట్యూట్‌కు రూ. 1.20 కోట్ల 80 వేలను వైద్య సదుపాయాలను మెరుగుపరిచేందుకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిర్వహణ నిమిత్తం సహాయనిధిగా గురువారం అందజేశారు.
ముఖ్య అతిథులుగా జా యింట్ వెంచర్ కంపెనీ బిజినెస్ హెడ్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మధుసూదన్ రావు, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, మహావీర్ హాస్పిటల్ చైర్మన్ మహేంద్ర కుమార్ రంక, జనరల్ మేనేజర్ రూబిన్ చెరియన్ చేతుల మీదుగా విరాళాన్ని అందజేశారు.
ఇందులో భాగంగా ఎఫ్ వై 2024 -25 కోసం బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదించిన ఈ సీఎస్ఆర్ నిధిని వ్యూహాత్మకంగా విభజించి రూ. 60.80 లక్షలు మహావీర్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ లో డయాగ్నొస్టిక్ లాబరేటరీ పునర్నిర్మాణం, ఆధునీకరణ కోసం కేటాయించగా, నిజాం మెడికల్ సైన్సెస్ ఇనిస్టిట్యూట్ ప్రత్యేక వైద్య పరికరాలకు కొనుగోలు కోసం రూ. 60 లక్షలు కేటాయించారు. సమాజ హితం, స్థిరమైన ఆరోగ్య సంరక్షణ అభివృద్ధికి నోవాటెల్, హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్, హెచ్ఐసీసీ విధానాలకు ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుందని నిర్వాహకులు తెలిపారు.