సిటీబ్యూరో, జూన్ 29 (నమస్తే తెలంగాణ): పోలీస్‌శాఖలోని అన్ని విభాగాల్లో మహిళా సిబ్బంది మేం సైతం అంటూ విధులు నిర్వహిస్తున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా మహిళా సిబ్బంది కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగస్వాములవుతున్నారు. దీంతో గృహహింసకు సంబంధించిన 23 శాతం కేసులు తగ్గుముఖం పట్టాయి. అదే విధంగా పోక్సో కేసుల్లో 10 శాతం తగ్గుదల, మహిళలపై వేధింపులు, సైబర్‌నేరాలు సైతం తగ్గుముఖం పట్టాయి. ఇదంతా విజిబుల్ పోలీసింగ్‌తో సాధ్యమవుతుందని రాచకొండ పోలీసులు చెబుతున్నారు.
పదేండ్ల క్రితం ఒక్కో పోలీస్‌స్టేషన్‌లో ఒకరిద్దరు మహిళా సిబ్బంది మాత్రమే విధులు నిర్వహించేవారు. వారు కూడా స్టేషన్లలోనే ఉండేవారు. అలాంటిది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పోలీస్ శాఖలో భారీగా మహిళా సిబ్బంది రిక్రూట్మెంట్ జరిగింది. పోలీస్ రిక్రూట్మెంట్లో 33 శాతం మహిళా సిబ్బందిని నియమించి మహిళకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. పోలీస్స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న మహిళా సిబ్బంది.. నేడు మేం సైతం అంటూ అన్ని రకాల విధులు నిర్వహిస్తున్నారు.
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శివారు ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ విజిబుల్ పోలీసింగ్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో మహిళా సిబ్బందిని కూడా భాగస్వామ్యం చేస్తున్నారు. పెట్రోలింగ్ విధుల్లో పుట్ పెట్రోలింగ్‌తోపాటు సైకిల్ పెట్రోలింగ్, వెహికల్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్న మహిళా సిబ్బంది.. కమ్యూనిటీ పోలీసింగ్‌లో కీలక భూమిక పోషిస్తున్నారు.
కమిషనరేట్ పరిధిలో ప్రతిరోజు 25 మంది మహిళా సిబ్బంది ఈ పెట్రోలింగ్ విధుల్లో పాల్గొంటున్నారు. పెట్రోలింగ్‌లో పురుషలతోపాటు మహిళా సిబ్బంది కూడా ఉంటున్నారు. తమ తమ పరిధిలో ఉన్న కాలనీలు, బస్తీలు, అసోసియేషన్లు, స్కూల్స్, ప్రార్థన మందిరాలు, వ్యాపార కేంద్రాలు.. ఇలా అన్ని చోట్లకు వెళ్తూ కమ్యూనిటీ పోలీసింగ్‌ను బలోపేతం చేస్తూ స్థానిక ప్రజలతో మమేకమవుతున్నారు. అలాగే.. డ్రగ్స్, సైబర్‌నేరాలు, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. సైబర్‌నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇంటర్నెట్లో ఆర్థిక లావాదేవీలు నిర్వహించవద్దని చెబుతున్నారు. పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, పెట్టుబడులు, డిజిటల్ అరెస్ట్‌లు, ఆన్లైన్ బెట్టింగ్, క్రికెట్ బెట్టింగ్‌లు వంటి నేరాలపై అవగాహన కల్పిస్తున్నారు.
మారు మూల ప్రాంతాలకు..
రాచకొండ కమిషనరేట్ పరిధిలో చాలా వరకు శివారు, గ్రామీణ, నిర్మానుష్య ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. అయినా కూడా పుట్ పెట్రోలింగ్, సైకిల్ పెట్రోలింగ్ చేయడంలో మహిళా సిబ్బంది ముందుంటున్నారు. విజిబుల్ పోలీసింగ్‌లో కీలకంగా వ్యవహరిస్తుండడంతో మహిళలపై వేధింపులు, గృహి హింసకు సంబంధించిన కేసుల్లోనూ అవగాహన కల్పిస్తున్నారు. మహిళా సిబ్బంది పెట్రోలింగ్ చేస్తూ కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా ప్రజలతో మమేకవుతున్నారు. షీ టీమ్స్ మఫ్టీలో తిరుగుతుంటే.. పెట్రోలింగ్ సిబ్బంది సైకిళ్లు, వాహనాలపై తిరుగుతుండడంతో పోకిరీల్లో భయం నెలకొంటుంది.
ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తున్నారు. మాడ్గుల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక గర్భిణికి తీవ్ర ఇబ్బంది ఎదురుకావడంతో విజిబుల్ పోలీసింగ్‌లో ఉన్న సిబ్బంది వెంటనే అప్రమత్తమై స్థానికంగా ఉండే వైద్యులను సంప్రదించి ఆమెకు తగిన సహాయం చేశారు. అలాగే నిజామాబాద్‌లో ఒక హత్య కేసు నిందితుడు ఆటోలో తిరుగుతుండగా అనుమానంతో అతన్ని ఫింగర్ ఫ్రింట్స్ను తనిఖీ చేసిన విజిబుల్ పోలీసులకు అతడు నిందితుడని తేలింది. ఇలా అన్ని రకాలైన పోలీసింగ్ సేవల్లో మహిళా సిబ్బంది పాల్గొంటూ మేం సైతం అంటున్నారు.
నేరాలు తగ్గుముఖం
విజిబుల్ పోలీసింగ్‌తో నేరాలకు చెక్
విజిబుల్ పోలీసింగ్‌తో ప్రజలకు మేమున్నామని భరోసా కల్పిస్తూ, నేరాలకు చెక్ పెడుతున్నాం. మహిళా సిబ్బంది అన్ని రకాలైన విధులు నిర్వహిస్తున్నారు, పెట్రోలింగ్ వ్యవస్థలో వారిని భాగస్వామ్యం చేశాం. సివిల్ కానిస్టేబుల్‌తో పాటు ఏఆర్‌లో పనిచేసిన వారిని సైతం అన్ని రకాలైన విధుల్లో భాగస్వాములను చేస్తున్నాం. విజిబుల్ పోలీసింగ్‌తో కమ్యూనిటీ పోలీసింగ్ మరింత బలోపేతమవుతుంది. దీంతో ప్రజలకు వివిధ అవగాహన కార్యక్రమాలు వేగంగా చేరుతున్నాయి. దీంతో ప్రధానంగా మహిళలపై వేధింపులు, సైబర్‌నేరాలు తగ్గుముఖం పడుతున్నాయి. విజిబుల్ పోలీసింగ్‌తో రాష్ట్రంలో ఉత్తమ ఫలితాలు రాచకొండ కమిషనరేట్ పరిధిలో సాధిస్తున్నాం.
– సుధీర్‌బాబు, రాచకొండ సీపీ