స్పృహలో ఉండగానే.. మెదడులోని కణితి తొలగింపు
మలక్‌పేట కేర్ దవాఖాన వైద్యులు స్పృహలో ఉన్న రోగికి మెదడులోని కణితిని(ట్యూమర్) విజయవంతంగా తొలగించి అరుదైన ఆపరేషన్ చేశారు.
- మలక్‌పేట కేర్ దవాఖానలో ఆపరేషన్ విజయవంతం
చాదర్‌ఘాట్, జనవరి 6 : మలక్‌పేట కేర్ దవాఖాన వైద్యులు స్పృహలో ఉన్న రోగికి మెదడులోని కణితిని(ట్యూమర్) విజయవంతంగా తొలగించి అరుదైన ఆపరేషన్ చేశారు. వైద్య రంగంలో మేజర్ శస్త్ర చికిత్సను స్పృహలో ఉన్న రోగికి సుమారు ఆరు గంటల పాటు తీవ్రంగా శ్రమించి మెదడులోని ఇతర భాగాలకు ఎటువంటి ప్రమాదం జరుగకుండా ట్యూమర్‌ను తొలగించారు. ఇందుకు సంబంధించి దవాఖాన చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కృష్ణమూర్తి, న్యూరోసర్జరీ విభాగాధిపతి డాక్టర్ కేవీ.శివానంద్‌రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్‌కు చెందిన గిరిధర్(40) కొద్ది రోజులుగా మూర్చ వ్యాధితో బాధపడుతుండడంతో కేర్ ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు. వైద్య పరీక్షలు నిర్వహించి మెసియల్ టెంపోరల్ స్లెరోసిస్తో బాధపడుతున్నట్లు గుర్తించారు.
శస్త్ర చికిత్స చేసి ట్యూమర్‌ను తొలగించాలని వైద్యులు నిర్ధారణ చేశారు. సాధారణ సర్జరీ చేస్తే రోగి ప్రాణాలు పోయే ప్రమాదముందని భావించి.. న్యూరో సర్జరీ, అనస్తీషియా వైద్యులు కలిసి అమిగ్డలోహిప్పో కాంపెక్టమీ అవేక్ క్రేనిటోమి సర్జరీ చేయాలని నిర్ణయించారు. సుమారు ఆరు గంటల పాటు శ్రమించి ట్యూమర్‌ను తొలగించినట్లు వైద్యులు పేర్కొన్నారు. శస్త్ర చికిత్స తరువాత 4వ రోజు రోగిని డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. కేర్ ఆసుపత్రి మలక్‌పేటలో తొలిసారిగా చేపట్టిన ఈ మేజర్ సర్జరీ విజయవంతం కావడంతో వైద్యులు హర్షం వ్యక్తం చేశారు. సర్జరీలో భాగస్వాములైన వైద్యులను చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కృష్ణమూర్తి అభినందించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

