హైదరాబాద్: హైదరాబాద్ ముషీరాబాద్‌లోని ఓ డాక్టర్ ఇంట్లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. తన ఇంటిని డ్రగ్స్ డెన్‌గా మార్చిన డాక్టర్ జాన్‌పాల్.. ముగ్గురు స్నేహితులతో కలిసి వ్యాపారం నిర్వహిస్తున్నాడు. పక్కా సమాచారంతో నిఘాపెట్టిన పోలీసులు, మంగళవారం ఉదయం అతని ఇంటినిపై దాడిచేశారు. ఈ సందర్భంగా ఓజీ కుష్, ఎండీఎంఏ, ఎల్ఎస్డీ, హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
డాక్టర్ జాన్‌పాల్‌ను అరెస్టు చేశారు. ఆయన స్నేహితులు ప్రమోద్, సందీప్, శరత్ పరారీలో ఉన్నారు. ఢిల్లీ, బెంగళూరు, గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్‌లో అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Drugsdoctor 1