సిటీబ్యూరో, అక్టోబర్ 7(నమస్తే తెలంగాణ): దీపావళి పండుగ నేపథ్యంలో ప్రత్యేక ఆఫర్లను తీసుకువచ్చినట్లు ప్రముఖ జ్యువెల్లరీ సంస్థ జీఆర్టీ వెల్లడించింది. సిల్వర్ ఫర్ గోల్డ్తోపాటుగా, ప్రతి బంగారు ఆభరణాల కొనుగోలుపై సమాన బరువుతో వెండి పూర్తిగా ఉచితంగా ఇస్తున్నట్లుగా వెల్లడించింది.
అదేవిధంగా వజ్ర ఆభరణాల కొనుగోలుపై ప్రతి క్యారెట్‌కు 25గ్రాముల వెండి, అన్‌కట్ డైమండ్స్‌పై ప్రతి క్యారెట్‌కు రెండు గ్రాముల వెండి, ప్లాటినం ఆభరణాలపై ఆభరణ బరువుతో సమానంగా వెండితోపాటు వెండి వస్తువుల మేకింగ్ చార్జీలపై 25శాతం తగ్గింపు, వెండి ఆభరణాలు, గిఫ్ట్ ఆర్టికల్స్ వస్తువుల ధరలపై 10శాతం తగ్గింపుతో పండుగ ఆఫర్లను ప్రకటించినట్లుగా జీఆర్టీ జ్యువెల్లర్స్ ఎండీ జీఆర్ ఆనంద్ అనంత పద్మనాభన్ వెల్లడించారు.
6 దశాబ్ధాల కాలంగా దేశవ్యాప్తంగా 65 షోరూంలు, సింగపూర్‌లో ఒక షోరూం ద్వారా.. బంగారం, వెండి, వజ్రాలు, ప్లాటినంతోపాటుగా విలువైన రత్నాలను అందిస్తున్నామనీ, ఆభరణాలను ఆఫర్ల ద్వారా కొనుగోలు చేసి ప్రతి ఇంట్లో పండుగ ఆనందాలను మరింత ఉత్సాహంగా జరుపుకోవాలన్నారు.