మేడ్చల్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్, అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం, వీవీ ప్యాట్ల ఫస్ట్ లెవల్ చెకింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో ఈ నెల 5న ప్రారంభించిన ఈ ప్రక్రియను పది రోజుల పాటు నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు.
26 మంది ఈసీఐఎల్ ఇంజినీర్ల బృందం సహకారంతో.. ఎలక్షన్ కమిషన్ ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు చెకింగ్ పూర్తి చేశారు. రెండు రోజుల పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించిన అనంతరం.. కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న ఏవీఎంలను గోడౌన్లలో భద్రపరిచి, సీల్ చేసినట్టు కలెక్టర్ గౌతమ్ పేర్కొన్నారు.