చిక్కడపల్లి : అర్హులందరికీ రేషన్ కార్డులు అందేలా చూస్తానని ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సోమవారం గాంధీనగర్ డివిజన్లో కొత్తగా మంజూరైన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్నినిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదని సీఎం కేసీర్ లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. అందులో భాగంగానే అర్హులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. కొత్త రేషన్ కార్డులు పొందిన వారందరికీ ఈ నెల నుంచే బియ్యం తదితర రేషన్ అందిస్తారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో 624 షాప్ నిర్వాహకుడు రాజు, పార్టీసీనియర్ నాయకుడు ముఠా నరేశ్, పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఎరం శ్రీనివాస్ గుప్తా, శ్రీకాంత్, గుండు జగదీశ్ బాబు, ఆకుల శ్రీనివాస్, రాకేష్,భాస్కర్,రవిశంకర్ గుప్తా, జహంగీర్, హన్మంతు, వెంకటేశ్, కిరణ్కుమార్, ఎస్టీ ప్రేమ్, సుధాకర్ తదితరలు పాల్గొన్నారు. .