ఈ నెల 18న సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించనున్న యువ సంగ్రామ సభ నేపథ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రధాన గ్రంథాలయంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఆహ్వాన పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తుంగ బాలు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. అభ్యర్థులను ప్రభుత్వం నిరాశకు గురిచేస్తోందన్నారు.
– సిటీ బ్యూరో, జూలై 16 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, జులై 16 (నమస్తే తెలంగాణ) : ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రధాన గ్రంథాలయంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి బీఆర్ఎస్ వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఈ నెల 18న సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించనున్న నిరుద్యోగ సంగ్రామ సభ ఆహ్వాన పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తుంగ బాలు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విస్మరించిందని విమర్శించారు.
ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, నిరుద్యోగ భృతి అందిస్తామని, ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేస్తామని, గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, డీఎస్సీ, పోలీస్, ఆరోగ్య శాఖ తదితర నియామకాలను వేగవంతం చేస్తామని ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామకాల్లో తీవ్ర జాప్యం, పరీక్షల నిర్వహణలో స్పష్టత లేకపోవడం, తరచూ షెడ్యూళ్లలో మార్పులు, ఖాళీల భర్తీలో నిర్లక్ష్యం కారణంగా లక్షలాది మంది నిరుద్యోగ యువత భవిష్యత్తుపై ఆందోళనతో ఉన్నారని పేరొన్నారు. ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి సిద్ధమవుతున్న అభ్యర్థులను ప్రభుత్వం నిరాశకు గురిచేస్తోందని విమర్శించారు.