సిటీబ్యూరో : నగరానికి మంచి నీరు సరఫరా చేస్తున్న కృష్ణా ఫేస్-1లో మరమ్మతుల కారణంగా ఆయా ప్రాంతాలకు అంతరాయం కలుగనున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. సర్జ్ ట్యాంక్ దగ్గరి 700 మిల్లీమీటర్ల డయా ఎంఎస్ పైప్‌లైన్‌కు ఏర్పడిన లీకేజీని అరికట్టడం, నాసర్లపల్లి నుంచి గోడకొండ్ల వరకు ఉన్న 2,200 మిల్లీమీటర్ల డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్‌లో దెబ్బతిన్న ఎయిర్ టీలు, వాల్వ్‌లను మార్చడం, నాసర్లపల్లి వద్ద 2,200 మిల్లీమీటర్ల డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్‌పై 600 మిల్లీమీటర్ల డయా ఎంఎస్ జంక్షన్ పనులు చేపట్టడం, కొండాపూర్, నాసర్లపల్లి పంపింగ్ స్టేషన్లలోని 600 ఎంఎం డయాపై దెబ్బతిన్న బీఎఫ్ వాల్వ్‌లు, ఎన్ఆర్వీలను మార్చడం వంటి పనులు చేపడుతున్నట్లు చెప్పారు.
ఈ పనులు ఈనెల 27న ఉదయం 6 గంటల నుంచి 28న సాయంత్రం 6 గంటల వరకు జరగనున్నట్లు తెలిపారు. ఈ 36 గంటల పాటు సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు వెల్లడించారు.