
కేపీహెచ్‌బీ కాలనీ, డిసెంబర్ 20 : కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభించడం సరికాదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. టీఆర్ఎస్ అధిష్టానం ఆదేశాలతో సోమవారం కూకట్పల్లి డివిజన్ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కృష్ణారావు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపి మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగంపై వివక్షత ప్రదర్శిచడం సరికాదన్నారు. పంజాబ్‌లో పండించిన వరి ధాన్యాన్ని మొత్తం కొంటున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టానికి చెందిన వరి ధాన్యాన్ని కొనం అని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. కార్యక్రమంలో తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ పాటిమీది జగన్మోహన్రావు, కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కేంద్రం నిరంకుశ వైఖరిని వీడాలి
కేపీహెచ్‌బీ కాలనీ, డిసెంబర్ 20 : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల పట్ల అవలంభిస్తున్న నిరంకుశ వైఖరిని వీడాలని కార్పొరేటర్ మందడి శ్రీనివాస్‌రావు డిమాండ్ చేశాడు. సోమవారం టీఆర్ఎస్ అధిష్టానం ఆదేశాల మేరకు కేపీహెచ్‌బీ కాలనీ డివిజన్ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జేఎన్టీయూహెచ్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పంజాబ్ రైతులకు ఒకన్యాయం, తెలంగాణ రైతులకు మరొక న్యాయం ఉంటుందా అని ప్రశ్నించాడు. తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యానం అంతా కేంద్ర ప్రభుత్వమే కొనాలని.. లేనిపక్షంలో తమ ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, కార్యదర్శి రాజేశ్, సర్వేశ్వర్రావు, సాయిశ్రీనివాస్, పాతూరిగోపి, పిడికిటి గోపాల్ చౌదరి, కచిన్, వలవలనాయుడు, యునీస్, మస్తాన్, నరేందర్‌రెడ్డి, చైతన్య ఉన్నారు.
బాలాజీనగర్ డివిజన్లో..
బాలాజీనగర్ డివిజన్ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేపీహెచ్‌బీ కాలనీ మొదటి రోడ్డు గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శిరీషాబాబురావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్షను ప్రదర్శిస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బాబురావు, డివిజన్ అధ్యక్షుడు సీహెచ్.ప్రభాకర్ గౌడ్, హరినాథ్, అరుణాశెట్టి, జ్యోతి, సంతోష్, శారద, భాస్కర్, సుశీల్, ధనలక్ష్మి, నర్సింహ నాయీ, రవీందర్‌రెడ్డి, ఆరోగ్యరెడ్డి, కైలానాయక్, శ్రీకాంత్, ఆనంద్, రంగమోహన్, లక్ష్మీరాజ్, సత్యప్రకాశ్ పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ మెడలు వంచుదాం..
బాలానగర్, డిసెంబర్ 20 : రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వ మెడలు వంచుతామని ఓల్డ్‌బోయిన్‌పల్లి, బాలానగర్ డివిజన్ల కార్పొరేటర్లు ముద్దం నర్సింహయాదవ్, ఆవుల రవీందర్‌రెడ్డి అన్నారు. బాలానగర్, ఓల్డ్‌బోయిన్‌పల్లి చౌరస్తాలలో వేర్వేరుగా డప్పులు కొడుతూ.. రాస్తారోకో, ర్యాలీ, ప్రధాని మోడీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తమ విధానాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మోహన్నరెడ్డి, ఆనంద్‌రెడ్డి, కృష్ణమూర్తి, నరేందర్‌గౌడ్, సయ్యద్ ఎజాజ్, భిక్షపతి, సుదర్శన్‌రెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.