కంటోన్మెం ట్: బంధువుల ఇంటికి వచ్చిన విద్యార్థి అదృశ్యమైన ఘటన బోయిన్పల్లి పీఎస్ పరిధిలో చోటు చేసుకుం ది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. షేక్‌పేట సాయిబాబా ఆలయం సమీపంలో దుర్గా శర్వాణి సరిపల్లి ధర్మతేజ నివాసం ఉంటున్నారు. కుమారుడు శ్రీహర్ష (15), కుమార్తె వైష్ణవి సారిక ఉన్నారు. ఈ నెల ఒకటిన దుర్గాశర్వాణి తన స్వస్థలమైన ఏలూరుకు వెళ్లింది.
ఆమె కుమారుడు శ్రీహర్ష న్యూబోయిన్‌పల్లి సంచారపురి కాలనీ ఫేజ్ 1 ఫ్లాట్‌నంబర్ 23లో ఉంటున్న అత్త, మామల ఇంటికి వచ్చాడు. సంచా రపురి కాలనీ నుంచి ప్రతిరోజు మెహదీపట్నంలోని రాయల్ జూనియర్ కళాశాలకు రాకపోకలు సాగించాడు. కాగా ఈ నెల 14వ తేదీన రాత్రి 8 గంటలకు తాను షేక్‌పేట వెళ్తానని చెప్పడంతో క్యాబ్ బుక్ చేసి పంపిస్తానని అత్త మామ చెప్పారు.
8.25 గంటలకు శ్రీహర్ష తాను వెళ్లిపోతున్నానంటూ చెప్పి వెళ్లిపోయాడని తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారమందించారు. షేక్‌పేటకు చేరుకోకపోవడంతో స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.