నాంపల్లి కోర్టులు, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): నాంపల్లి కోర్టుల్లో కంప్యూటర్ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ఏర్పాటు చేసిన డిజిటైజేషన్ సెంటర్‌ను తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే, జస్టిస్ సుజయ్‌పాల్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం డిజిటైజేషన్ సెంటర్ పలకం ఆవిష్కరించారు.
నాంపల్లి కోర్టుల ఇన్చార్జి, జిల్లా జడ్జి సురేశ్.. జస్టిస్ ఆరాధేకు పుష్పగుచ్ఛాన్ని అందించి స్వాగతం పలికారు. అదే విధంగా.. జస్టిస్ సుజయ్ పాల్‌ను కూడా పుష్పగుచ్ఛంతో సత్కరించారు. నాంపల్లి కోర్టుల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజ్యవర్ధన్రెడ్డి, ఉపాధ్యక్షుడు గోకుల్, ప్రధాన కార్యదర్శి శ్రీనాథ్, సభ్యులు, నాంపల్లి కోర్టులోని అన్ని కోర్టుల మెజిస్ట్రేట్లు, జిల్లా జడ్జీలు, సిబ్బంది, న్యాయవాదులు పాల్గొన్నారు.