చార్మినార్, ఏప్రిల్ 26: ‘ఎన్నాళిలా చాలీ చాలనీ జీతాలతో నెట్టుకొద్దాం… విలాసవంతమైన జీవితం అనుభవించాలనుందా? వెంటనే లాభాలు కావాలా? అయితే వెంటనే మా కంపెనీలో చేరండి’ అంటూ అందమైన విల్లాలు, విలాసవంతమైన జీవనం గడిపే వీడియోలను ఎర గా వేసి ప్రజలను మోసాలకు గురిచేస్తున్న ఓ ఘరానా నేరగాన్ని చార్మినార్ జోన్ పో లీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం చార్మినార్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నిందితుడి వివరాలు వెల్లడించారు. గురుగ్రామ్‌కు చెందిన హరీష్‌కుమార్ సింగ్ల్లా (61). ఇతను ఫరెవర్ లీవింగ్ ఇంపోర్ట్ కంపెనీకి కంట్రీ సేల్స్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నాడు.
కంపెనీ పేరులో వివిధ సోష ల్ మీడియా ఫ్లాట్‌ఫాంలలో అందమైన లోకేషన్లలో చిత్రీకరించిన వీడియోలను అప్లోడ్ చేసి ఆకర్షిస్తున్నారు. ఆకర్షితులై న ప్రజలకు కంపెనీ మెంబర్షిఫ్ పేరుతో వివిధ రకాలుగా ఫీజులను వసూళ్లు చేస్తున్నాడు. హరీష్‌కుమార్ సింగ్లా ఇంట్లో మ హిళలను టార్గెట్ చేస్తూ వారిని ఈ మల్టీలెవల్ స్కాంలోకి లాగుతున్నట్లు పోలీసు లు గుర్తించారు. వర్క్ ఫ్రం హోం పేరిట స్కీంను ప్రచారం చేయడంతో అనేక మం ది యువతీ యువకులు సభ్యులుగా చే రారు. తక్కువ సమయంలో ఎక్కుత ఆ దాయం, అనుకున్న సంతోషాల జీవితం అంటూ ఊదరగొట్టే ప్రచారాన్ని నిజమని నమ్మిన అనేక మంది హరీష్‌కుమార్ సిం గ్లా చెప్పిన స్కీంలో సభ్యులుగా చేరారు. మీర్‌చౌక్ పోలీస్‌స్టేషన్‌లో నివసించే ఓ యువకుని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణలో భారీ మోసాన్ని బట్టబయలు చేశారు.
కంపెనీలో సభ్యులుగా చేరిన వారిని మూడు రకాలుగా వర్గీకరించి ఒక్కో స్టేజికి ఒక్కో ఫీజు నిర్థారించారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్ సర్వీసులంటూ శిక్షణా తరగతుల పేరుతో 199, నుండి 249 వరకు మెంబర్షిఫ్ రిజిస్ట్రేషన్ ఫీజు వసూళ్లు చేసేవాడు. అందులోనూ స్లో ట్రాక్, మీడియం ట్రాక్, ఫాస్ట్‌ట్రాక్ లాంటి కాంబో ప్యాకేజీలను ప్రవేశపెట్టి సభ్యుల నుండి భారీగా వసూళ్లు చేశాడు. ఇందులో కంపెనీ ప్రాడక్ట్ సేల్ చేయడం కంటే సులువుగా సభ్యులను చేర్చితేనే అధిక లాభాలని మాయామాటలు చెప్పడంతో అమాయక ప్రజలు తొందరగా నిందితుని మాటలకు ప్రభావితమైనట్లు గుర్తించారు. కంపెనీలో సభ్యులుగా చేరడం చిన్న అమౌంట్‌తో రిజిస్ట్రేషన్ చేయడం లాంటివి ప్రజలు గమనించి ‘పెద్ద మొత్తం కాదుగా..’ అనే భావనలో అదికంగా సభ్యులను చేర్చడానికి ఆసక్తి చూపించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇలా నిందితుడు హరీష్‌కుమార్ సింగ్లా నగరంతోపాటు చుట్టూ ఉన్న చిన్న నగరాలు, జిల్లా కేంద్రాల్లోనూ తన ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని మల్లీలెవల్ స్కాంకు పాల్పడినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.
సభ్యులను చేర్చినా తమకు అందాల్సిన లాభాలు రాకపోవడంతో సభ్యులకు అనుమానం కలిగింది. అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ తప్పించుకు తిరుగుతున్న స్థానిక ఏజెంట్ల వ్యవహారంపై చార్మినార్ జోన్‌లోని మాదన్నపేట్, రెయిన్‌బజార్, మీర్‌చౌక్ పోలీస్‌స్టేషన్ పరిధుల్లో పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుల్లో పోలీసులు గతంలో మొహమ్మద్ అక్రమ్, మొహమ్మద్ నౌమాన్ రజా, మొహమ్మద్ అస్లాంలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఏజెంట్లు పోలీసులకు చిక్కుతున్నా ప్రధాన నిందితుడు చిక్కకపోవడంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. దీంతో అసలు సూత్రధారి హరీష్‌కుమార్ సింగ్లాను పోలీసులు అదపులోకి తీసుకున్నారు. నిందితుని ఖాతాను పరిశీలించిన పోలీసులు అధిక లావాదేవీల నిర్వహణతోపాటు 3 కోట్ల నగదును గుర్తించారు. వెంటనే అతని ఖాతాను ఫ్రీజ్ చేసిన పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు సాగించనున్నామని డీసీపీ కిరణ్‌కుమార్ తెలిపారు. నిందితుని వద్ద నుండి ఓ మెర్సిడెజ్ బెంజ్ కారుతోపాటు మ్యాక్‌బుక్, ఐ ఫ్యాడ్, మూడు స్మార్ట్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ సమావేశంలో మీర్‌చౌక్ ఏసీపీ శ్యాం సుందర్, ఇన్స్పెక్టర్ కొండలరావు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.