పీర్జాదిగూడ, ఏప్రిల్ 17: చిన్నప్పటి నుంచి చిత్రలేఖనం పై ఉన్న మక్కువతో చిత్రాలు వేసేది. చదువుతో పాటు తనలో దాగివున్న కళకు పదును పెట్టింది. పీర్జాదిగూడకు చెందిన ఉప్పలోజు హర్షిణి ఎంటెక్ చదువుకుంటూ ఖాళీ సమయంలో తనకు తెలిసిన చిత్రకళలో భాగంగా రంగుల పేపర్లతో బొమ్మలను తయారు చేయాలనే ఆలోచన వచ్చింది.
వెంటనే ‘పేపర్ క్విల్లింగ్ ఆర్ట్స్’ ద్వారా వివిధ రకాల బొమ్మలు తయారు చేసి తన ప్రతిభ చాటుకుంటున్నది. రంగు రంగుల పేపర్లతో ఫొటో ప్రేమ్స్, గ్రీటింగ్స్, మినీయేచర్ డాల్స్ పాటు బతుకమ్మ ఎత్తుకునే మహిళల రూపాలు, పలు రకాల కూరగాయలు, గణేశ్, శ్రీకృష్ణుడు, శివలింగాల ప్రతిమలు, పూలు, టీ కప్పులు, పండుగల సందర్భంగా వివిధ రకాల గిఫ్ట్‌లను తయారు చేయగా.. అవి పలువురిని ఆకట్టుకుంటున్నాయి.