అమ్మా దవాఖాన కైసే హే ? దవా అచ్చా దే రహే క్యా ? ఖానా అచ్చా హై ? స్టాఫ్ నర్స్ అచ్చే బాత్ కర్ రహే హై ? అంటూ నాంపల్లి ఏరియా దవాఖానాలోని ప్రసూతి వార్డులోని మహిళలను మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆప్యాయంగా పలకరించారు. నాంపల్లి ఏరియా దవాఖానలో డయాలసిస్, బ్లడ్ బ్యాంక్‌ను ప్రారంభించిన అనంతరం వార్డుల్లో పర్యటించి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.
దవాఖానలో వైద్యులు సేవలు మంచిగా అందిస్తున్నారా ? బాత్రూంలలో నీళ్లు వస్తున్నాయా ? క్లీన్‌గా ఉన్నా యా ? కేసీఆర్ కిట్ ప్రతి ఒక్కరికి అందిందా ? అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓ వార్డు వద్ద ఉన్న బాత్రూంలో ట్యాప్ సరిగ్గా మూసివేయక పోవడాన్ని గమనించిన మంత్రి.. నీళ్లు వృథా కాకుండా చూసుకోవాలని సిబ్బందిని హెచ్చరించారు. అనంతరం వైద్యులు, సిబ్బంది సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారితో సెల్ఫీలు దిగారు.
– సుల్తాన్‌బజార్/ మెహిదీపట్నం ఏప్రిల్ 20