Hyderabad | హైదరాబాద్ : చెడ్డీ గ్యాంగ్.. ఇదొక దొంగల ముఠా. చెడ్డీ గ్యాంగ్ మాదిరే ఇప్పుడు ధార్ గ్యాంగ్ హల్చల్ సృష్టిస్తోంది. హైదరాబాద్ శివార్లలో ధార్ గ్యాంగ్ దోపిడీలకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఈ ధార్ గ్యాంగ్ దోపిడీలకు సంబంధించిన వీడియోలను పోలీసులు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాసులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
హయత్ నగర్, అమీన్పూర్, వనస్థలిపురం ఏరియాల్లో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌కు చెందిన ధార్ గ్యాంగ్ సభ్యులు తిరుగుతూ స్థానికులను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఉదయం సమయంలో ఆటోల్లో తిరుగుతూ రెక్కీ నిర్వహిస్తున్నారు. ఇక అర్ధరాత్రి కాగానే ఉదయం రెక్కీ నిర్వహించిన ఇండ్లలోకి వెళ్తున్నారు. ఇండ్లలోకి చొరబడి.. దొరికినకాడికి దోచుకుంటున్నారు. అంతేకాదు అడ్డొచ్చిన కుటుంబ సభ్యులపై క్రూరమైన దాడులకు పాల్పడుతున్నట్లు తెలిసింది. తాజాగా ధార్ గ్యాంగ్‌కు సంబంధించి సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు.
హైదరాబాద్ వాసులారా జాగ్రత్త.. హైదరాబాద్‌లో తిరుగుతున్న భయంకరమైన ధార్ గ్యాంగ్
హైదరాబాద్‌లోని హయత్ నగర్, అమీన్ పర్, వనస్థలిపురంలో తిరుగుతున్న యూపీకి, మధ్యప్రదేశ్‌కు చెందిన ధార్ అనే దొంగల ముఠా.
తాజాగా వీరికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలు పోలీసులు విడుదల… pic.twitter.com/B9Ac4WdvR7
— Telugu Scribe (@TeluguScribe) June 14, 2024