సిటీబ్యూరో: ట్యాంక్‌బండ్ వద్ద జరుగుతున్న గణేశ్ నిమజ్జన కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలన సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి భక్తుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. నిమజ్జనం సందర్భంగా పోలీసుల తీరును మేయర్ వద్ద ఎండగట్టారు.
పోలీసులు సహకరించకుండా వాహనాల అద్దాలు పగలగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా? అని భక్తులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా మేయర్ స్పందిస్తూ వెంటనే అధికారులతో మాట్లాడతానని భక్తులకు హామీ ఇచ్చారు.