ఖైరతాబాద్, సెప్టెంబర్ 20 : ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీ దశ మహా విద్యా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. మొదటి రోజు తొలి పూజ మొదలు అర్ధరాత్రి వరకు 4లక్షలు, మంగళ, బుధవారం మరో రెండు లక్షల మంది దర్శించుకున్నారని ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు.
కట్టుదిట్టమైన బారికేడింగ్, పెద్ద ఎత్తున ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసుల బందోబస్తు మధ్య భక్తులు ప్రశాంతంగా స్వామి వారిని దర్శించుకుంటున్నారు. కాగా, బుధవారం సాయంత్రం లంగర్ హౌస్‌కు చెందిన వ్యాపార వేత్త జనల్లి శ్రీకాంత్ 2,200 కిలోల లడ్డూను సమర్పించారు. తప తండ్రి శ్రీహరితో కలిసి ప్రతి ఏడాది లడ్డూ సమర్పిస్తున్నానని చెప్పారు.