హయత్‌నగర్, ఆగస్టు 1 : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎల్బీనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హయత్‌నగర్ డివిజన్లోని మహాగాయత్రినగర్ కాలనీలో శుక్రవారం ముద్దం పరమేశ్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన బేడా బుడగ జంగం సభ్యులు దాదాపు 80 మంది ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
పార్టీలో చేరిన వారిలో తూర్పాటి చిన్న కోటయ్య, శ్రీనివాసులు, కోటయ్య, వెంకటేశ్, యాదగిరి, సత్యనారాయణ, రామస్వామితోపాటు పలువురు ఉన్నారు. ఈ కార్యక్రమంలో హయత్‌నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డి, డివిజన్ అధ్యక్షుడు చెన్నగోని శ్రీధర్‌గౌడ్, మాజీ అధ్యక్షుడు గుడాల మల్లేష్ ముదిరాజ్, సీనియర్ నాయకురాలు మల్లీశ్వరి, భాస్కర్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.