సిటీబ్యూరో, మే 4 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్లో పలు అభివృద్ధి పనులను ఆదివారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పరిశీలించారు. ముందుగా బంజారాహిల్స్‌లో జీవీకే మాల్ వద్ద సుమారు రూ. 5 కోట్లతో చేపట్టిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిని, అనంతరం దారుల్ షిఫా వద్ద ఓల్డ్ సిటీ కారిడార్‌ను పరిశీలించారు. దారుల్ షిఫా నుంచి మండీ రోడ్, శాలిబండ జంక్షన్ మార్గంలో ప్రభావిత కట్టడాల కూల్చివేత పనులను సీఎస్ పరిశీలించారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు చేపట్టే మెట్రో లైన్ పనుల గురించి మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చీఫ్ సెక్రటరీకి వివరించారు.
భూసేకరణ ప్రక్రియ వేగవంతంగా చేయాల్సి ఉందని వివరించారు. ఖుర్షీద్ ఝౌ దేవిడీ హెరిటేజ్ భవనం హెచ్ఎండీఏ నిధులతో పునరుద్ధరణ, మరమ్మతుల పనులు, ఫలక్‌నుమా ఆర్వోబీ, నల్గొండ ఫె్లైఓవర్ పనులు, మూసారంబాగ్ బ్రిడ్జి నిర్మాణ పనులను సీఎస్ పరిశీలించారు. అనంతరం అంబర్‌పేట ఎస్టీపీ పనులను పరిశీలించి త్వరితగతిన పనులను పూర్తి చేయాలని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డిని ఆదేశించారు. పురపాలక సెక్రటరీ కె.ఇలంబర్తి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్, బల్దియా కమిషనర్ ఆర్ వీ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు.