బంజారాహిల్స్,అక్టోబర్ 9: జూబ్లీహిల్స్ డివిజన్లోని పలు బస్తీల్లో మురుగు సమస్యలను పరిష్కరించడంతో పాటు మంచినీటి సరఫరాను మరింత మెరుగుపర్చేందుకు జలమండలి ఆధ్వర్యంలో సుమారు రూ. 2కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధ్ది పనులను ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సోమవారం ప్రారంభించారు. సోమవారం ఉదయం 10 నుంచి 11 గంటల నడుమ డివిజన్ పరిధిలోని పలు బస్తీల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఎన్నికల కోడ్ రానుండడంతో వివిధ బస్తీల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. బండారుబాల్రెడ్డి నగర్లో మురుగు సమస్యల పరిష్కారం కోసం రూ.57లక్షల వ్యయంతో చేపట్టనున్న 300 ఎంఎం డయా సీవరేజ్ లైన్, 450 ఎంఎం డయా ఆర్సీసీసీ ఎన్పీ3 సీవరేజీ లైన్ పనులను ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రారంభించారు.
ఖైరతాబాద్, అక్టోబర్ 9 : సోమాజిగూడ డివిజన్లోని హరిగేట్లో ఎన్నికల కోడ్ రావడానికి ముందు సోమవారం ఉదయం రూ.75 లక్ష్యంతో సీవరేజీ పనులకు ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు వనం సంగీత యాదవ్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు ఎస్కె అహ్మద్, ప్రధాన కార్యదర్శి పి. నాగరాజు, గయాజ్, ఆనంద్ గౌడ్, రజిని, అన్వర్, ఉత్తమ్ జగన్, నాగమణి తదితరులు పాల్గొన్నారు.