సిటీబ్యూరో, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ) : సర్కారు వైద్యశాలలను ముఖ్యమంత్రి కేసీఆర్ మరింత బలోపేతం చేశారు. ముఖ్యంగా నిరుపేద, మధ్య తరగతి ప్రజలు ఆశ్రయించే ఉస్మానియా, గాంధీ, నిమ్స్…తదితర దవాఖానలతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పటిష్టపర్చడమే కాకుండా బస్తీదవాఖానలను గ్రేటర్ వ్యాప్తంగా విస్తరింపచేశారు. 2022లో అత్యాధునిక వైద్యపరికరాలు, నూతన భవనాలు, రోగి సహాయకులకు మూడు పూటలా రూ.5 భోజనం, నైట్ షెల్టర్, పీహెచ్‌సీల పరిధిలో మినీ టీ-హబ్స్, టిఫా స్కానింగ్ యంత్రాలు, క్యాథ్లాబ్స్ తదితర ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు.
ఉస్మానియా 40 కోట్లు
గాంధీ 190 కోట్లు
సుల్తాన్‌బజార్ ప్రసూతి దవాఖాన
గర్భిణుల చికిత్స కోసం రెండు అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, వైద్యపరీక్షలకు ఆధునిక ల్యాబ్
రోగి సహాయకులకు షెడ్ కోఠి ఈఎన్టీ దవాఖాన రెండు కాక్లియర్ ఇంప్లాంట్ థియేటర్లు ఈఎన్టీ టవర్ నిర్మాణానికి శంకుస్థాపన12 మినీ డయాగ్నోస్టిక్ హబ్స్ జీహెచ్ఎంసీ పరిధిలో 2022లో కొత్తగా 12 మినీ డయాగ్నోస్టిక్ హబ్స్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ఎక్స్‌రే, ఈసీజీ, స్కానింగ్ వంటి ఖరీదైన వైద్యపరీక్షలు
ఉచితంగా నిర్వహిస్తున్నారు.
నిమ్స్ 1850 కోట్లు