– టీఆర్ఎస్ లో చేరిన బీజేపీ నాయకులు, మహిళా కార్యకర్తలు
పహాడీషరీఫ్ : టీఆర్ ఎస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి సాధ్యమని, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జల్ పల్లి మున్సిపాలిటీ టీఆర్ ఎస్ ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీ నాగభూషణం ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామకాలనీకి చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం మంత్రి సమక్షంలో టీఆర్ ఎస్ లో చేరారు.
వారికి మంత్రి టీఆర్ ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని టీఆర్ ఎస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు. కాలనీ, బస్తీలలో మునుపెన్నడూ లేని విధంగా మౌలిక వసతులు సమకూరుతున్నాయన్నారు.
అనంతరం పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి , చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను, తమ కాలనీ సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనునిత్యం ప్రజలతో ఉంటూ, సమస్యలు తెలుసుకుంటూ చేపడుతున్న అభివృద్ధిని చూసి టీఆర్ ఎస్ పార్టీ పట్ల ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ ఎస్ నాయకులు విజయ్ కుమార్ , అనిల్ కుమార్ , శ్రీకాంత్ , పార్టీలో చేరిన బీజేపీ నాయకులు గంగునాయక్ , రూప్ సింగ్ , విఠల్ నాయక్ , ఆశప్ప, రాము, శ్రీను, చంద్రయ్య, జాంసన్ , మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.