ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 7 : చేనేత వస్తువులను ప్రోత్సహించి, చేనేత కార్మికుల ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్రెడ్డి పిలుపునిచ్చారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని తార్నాకలోని మర్ని చెన్నారెడ్డి ఫంక్షన్హాల్లో ఈఫిల్ లైఫ్ ఆర్ట్స్, క్రాఫ్ట్స్, కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో హాండ్లూమ్, క్రాఫ్ట్ మేళాను ఏర్పాటు చేశారు. ఈ మేళాను వరంగల్ మేయర్ గుండు సుధారాణితో కలిసి నగర డిప్యూటీ మేయర్ ప్రారంభించారు. కార్యక్రమంలో మేళా నిర్వాహకులు శివరాం, వంశీకృష్ణ, మృత్య ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.