కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 29 : పేదలకు ఆధునిక వైద్య సేవలు(Modern medical services) అందించాలని, రోగిని ప్రేమతో ఆదరించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క(Deputy CM Bhatti) అన్నారు. గురువారం కేపీహెచ్బీ కాలనీ మొదటి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన చిరంజీవి వాస్కులర్, మల్టీస్పెషల్ వైద్యశాలను భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సమాజంలో నేడు వైద్యం ఖరీదైనదని, పేదలకు సైతం ఆధునిక వైద్యసేవలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
డాక్టర్ వృత్తి గొప్పదని, డాక్టర్లు సేవాదృక్పదంతో పనిచేయాలని, రోగిని ప్రేమతో ఆదరించాలన్నారు. హైదరాబాద్ నగరం అన్ని రంగాలలో పురోగతిని సాధించిందని, విద్యా, వైజ్ఞానిక, టెక్నాలజీ, వైద్య రంగాలలో విశేషంగా పురోగమిస్తుందన్నారు. కార్యక్రమంలో వైద్యశాల చైర్మన్, వాస్కులర్ సర్జన్ కె.సంజీవరావు, స్కిన్ స్పెషలిస్ట్ పొన్నాడ శిల్ప , ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు వంశీకృష్ణ, స్థానిక రాజకీయ నాయకులు, సినిమా నటులు, దర్శకులు పాల్గొన్నారు.