రాష్ట్ర ప్రభుత్వం సోలార్ పవర్ పాలసీని త్వరగా తీసుకురావాలని తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ అధ్యక్షుడు బుర్ర అశోక్ కుమార్ గౌడ్ కోరారు. ఈ మేరకు ఉపముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కను ప్రజా భవన్లో శనివారం తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ సభ్యుల బృందం కలిసింది.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పీఎం సూర్య ఘర్ ముఫ్తీ బిజిలి పథకాన్ని రాష్ట్రంలో సద్వినియోగం చేసుకోవాలని, సోలార్ పవర్ ఉత్పత్తికి ప్రభుత్వ ప్రోత్సాహం అవసరమని మంత్రికి వివరించామని బుర్ర అశోక్ కుమార్ గౌడ్ తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీహరి బాబు, ఉపాధ్యక్షుడు రాజేశ్, సంయుక్త కార్యదర్శి బాబు నాయుడు, శ్రీనివాస్ ఉన్నారు.
– సిటీబ్యూరో, మార్చి 2 (నమస్తే తెలంగాణ)