e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 22, 2021
Home హైదరాబాద్‌ జ్వర లక్షణాలతో ప్రజల్లో అయోమయం

జ్వర లక్షణాలతో ప్రజల్లో అయోమయం

  • ప్రధాన లక్షణాలు, వైద్యపరీక్షల ఆధారంగా గుర్తించవచ్చు
  • ఫీవర్‌ హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శంకర్‌

ప్రస్తుతం కరోనా కాలం కావడంతో ఏ జ్వరం వచ్చినా అటు వైద్యుల్లో ఇటు ప్రజల్లో అయోమయం తప్పడం లేదు. ముఖ్యంగా డెంగీ, కరోనా లక్షణాలు ఇంచుమించు ఒకేలా ఉండడమే దీనికి ప్రధాన కారణం. దీనికి తోడు సీజనల్‌లో భాగమైన వైరల్‌ ఫీవర్‌. అయితే రోగి లక్షణాల ఆధారంగా ఏది కరోనానో, ఏది డెంగీనో, ఏది వైరల్‌ ఫీవరో అంచనా వేయవచ్చంటున్నారు వైద్యనిపుణులు.
రోగిలోని ప్రధాన వ్యాధి లక్షణాలను నిశితంగా పరిశీలించడంతో పాటు కాంటాక్ట్‌ హిస్టరీతో ఈ రెండు వ్యాధులను వేర్వేరుగా చూడవచ్చంటున్నారు. కరోనా, డెంగీ రెండూ వేర్వేరు వైరస్‌లు అయినప్పటికీ ఈ రెండింటిలో జ్వరం అనేది కామన్‌ సింప్టమ్‌. అయితే కరోనా వైరస్‌ ప్రధానంగా రోగిలోని శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపుతుందని, అదే డెంగీ రక్తంలోని ప్లేట్‌లెట్స్‌పై ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు.

ఈ తేడాను గుర్తించి వ్యాధిని నిర్ధారించవచ్చంటున్నారు. ఇక వైరల్‌ ఫీవర్స్‌ నిర్ధారణకు సీబీపీ పరీక్ష తప్పనిసరన్నారు. ఇందులో న్యూట్రోఫిల్స్‌/లింపోసైడ్స్‌(N/L)శాతం 2 కంటే తక్కువగా వస్తే సదరు రోగికి వైరల్‌ ఇన్‌ఫెక్షన్స్‌ ఉన్నట్లు గుర్తిస్తారు. అది ఏ రకమైన వైరల్‌ ఇన్‌ఫెక్షనో తెలుసుకునేందుకు ముందుగా యాంటీ బాడీ టెస్ట్‌, పీసీఆర్‌ పరీక్ష జరిపిస్తే ఏది కరోనానో ఏది డెంగీనో తేలిపోతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే సాధారణంగా ఏదేని వైరల్‌ ఫీవర్‌ సోకినా 5 రోజుల తరువాతనే యాంటీబాడీ పరీక్షల ద్వారా తెలుస్తుందని వైద్యులు చెబుతున్నారు.

చికిత్స విధానం

- Advertisement -

డెంగీ ఫీవర్‌కి ప్రత్యేక చికిత్స లేదు. దీనికి కూడా సపోర్టింగ్‌
ట్రీట్‌మెంటే ఉంది. ప్రధానంగా ఈ ఫీవర్‌ సోకిన వారు ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. చికిత్సలో భాగంగా ఫ్లూయిడ్స్‌, యాంటీబాడీస్‌ మందులు ఇస్తారు. ప్లేట్‌లెట్స్‌ సంఖ్య 20 వేలకు పడిపోతే ప్లేట్‌లెట్స్‌ ఎక్కించాల్సి ఉంటుంది. రోగిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలి.

చికిత్స విధానం

కరోనాకు ప్రత్యేక చికిత్స లేదు. సపోర్టింగ్‌ ట్రీట్‌మెంటే ఉంది. ముఖ్యంగా శ్వాస సమస్య వచ్చిన రోగులకు ఆక్సీజన్‌ పెట్టడం, సమస్య తీవ్రంగా ఉంటే ఐసీయూలో పెట్టి వెంటిలెటర్‌పై ఉంచుతారు. వైరస్‌ ప్రభావంతో రోగిలో ఏర్పడే ఇతర అనారోగ్య సమస్యలకు అవసరమైన చికిత్స అందిస్తారు. జలుబు, జ్వరం, దగ్గుతో పాటు యాంటీబయాటిక్స్‌ ఇస్తారు. కొంత మందికి రక్తం గడ్డకట్టకుండా, మరికొంత మందికి స్టెరాయిడ్స్‌ వంటివి ఇవ్వడం జరుగుతుంది.

డెంగీ ప్రధాన లక్షణాలు

ఇది దోమ కాటు వల్ల వస్తుంది
ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు
తీవ్రమైన జ్వరం ఉంటుంది.
భరించలేని ఒంటినొప్పులు
తీవ్రమైన తలనొప్పి
రక్తంలో ప్లేట్‌లెట్స్‌ సంఖ్య పడిపోతుంది
రన్నింగ్‌ నోస్‌ అంటే ముక్కు కారుతుంది
చర్మంపై దద్దుర్లు వస్తాయి
రిట్రో ఆర్బిటాల్‌ పెయిన్‌
హ్యుమటోక్రైట్స్‌ తగ్గుతాయి
కళ్లు ఎర్రబడతాయి

కరోనా ప్రధాన లక్షణాలు

ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అంటు వ్యాధి
జ్వరం సాధారణంగా ఉంటుంది
ఒంటి నొప్పులు ఉంటాయి కానీ అంత తీవ్రంగా ఉండవు
ముఖ్యంగా ముక్కు కారదు.
గొంతు నొప్పి ఉంటుంది.
తలనొప్పి, కండ్లు ఎర్రబడటం
కొంత మందిలో చర్మంపై ఎర్రని కురుపులు వస్తాయి.
దగ్గు, జలుబు ఉంటుంది.
ఆయాసం వస్తుంది.
ఊపిరి ఇబ్బందిగా మారి శ్వాస సమస్య వస్తుంది.
చాలా మంది రుచి, వాసన కోల్పోతారు.

వైరల్‌ ఫీవర్‌ లక్షణాలు

సాధారణ జ్వరం
గొంతు నొప్పి
సాధారణ దగ్గు
కీళ్లనొప్పులు (చికున్‌ గున్యాలో)
మూడు రోజులకు లక్షణాలు తగ్గిపోతాయి
ఆయాసం, శ్వాస సమస్య ఉండదు

నిశితంగా పరిశీలిస్తే గుర్తించవచ్చు

కరోనా, డెంగీ, ఇతర సీజనల్‌ వ్యాధులను వాటి ప్రధాన లక్షణాల ఆధారంగా గుర్తించవచ్చు. ముఖ్యంగా డెంగీ, కరోనా అనేవి రెండు వేర్వేరు వైరస్‌ల ద్వారా సంక్రమిస్తాయి. వీటిలో కొన్ని లక్షణాలు మాత్రమే ఒకేలా ఉంటాయి. మిగిలిన లక్షణాలు పూర్తి భిన్నంగా ఉంటాయి. రోగికి వచ్చిన వ్యాధి ప్రధాన లక్షణాల ఆధారంగా డెంగీ, కరోనాను
గుర్తించవచ్చు.- డాక్టర్‌ శంకర్‌, సూపరింటెండెంట్‌, నల్లకుంట ఫీవర్‌ హాస్పిటల్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement