బంజారాహిల్స్,జూలై 31: ఎంజాయ్ చేద్దామంటూ ఫోన్ చేసిన మహిళ మాటలను నమ్మి పబ్‌కు వెళ్లిన వ్యక్తిని కిడ్నాప్ చేయడంతో పాటు టాస్క్‌ఫోర్స్ పోలీసులమంటూ స్టోరీ క్రియేట్ చేసి డబ్బులు గుంజేందుకు యత్నించిన ఘటనలో ఐదుగురిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. అత్తాపూర్‌లో నివాసముంటున్న సచిన్ దూబే(46) బంజారాహిల్స్ రోడ్ నం. 10లోని టిబారుమల్ జువెలర్స్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తుంటాడు.
అతడికి పబ్‌లకు వెళ్లే అలవాటు ఉంది. ఈ క్రమంలో కూకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్‌లో డ్యాన్సర్‌గా పనిచేస్తున్న డింపుల్ యాదవ్(26) అనే మహిళతో పరిచయం ఉంది. ఈ నెల 19న కూకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్ పబ్‌కు రావాలంటూ డింపుల్ యాదవ్ ఫోన్ చేసి సచిన్ దూబేను పిలిచింది. దాంతో రోడ్ నం.10లో తన బైక్‌ను పార్క్ చేసి, ర్యాపిడోను బుక్ చేసుకొని అక్కడకు వెళ్లిన సచిన్‌దూబే అమెతో కలిసి మద్యం సేవించడంతో పాటు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశాడు.
అర్థరాత్రి పబ్ మూసిన తర్వాత మద్యం మత్తులో ఉన్న సచిన్‌ను ఇంటివద్ద దింపుతానంటూ డింపుల్ యాదవ్ తన యాక్టివా బైక్‌మీద ఎక్కించుకుంది. బంజారాహిల్స్ రోడ్ నం.3లోని టీవీ 9 చౌరస్తా దాటగానే వారిని వెంబడిస్తున్న ఓ పార్చ్యూనర్ కారును అడ్డుపెట్టారు. డింపుల్ యాదవ్ బైక్‌మీద ఉన్న సచిన్ దూబేను కారులో ఎక్కించుకుని ముఖానికి మాస్క్ వేసిన నలుగురు వ్యక్తులు కొంతదూరం ప్రయాణించిన తర్వాత ఓ గదిలోకి తీసుకువెళ్లారు.
అపస్మారక స్థితిలో ఉన్న సచిన్‌దూబే వస్ర్తాలు తొలగించి, మరో యువతితో కలిసి నగ్నవీడియోలు, ఫొటోలు తీశారు. అతడి వంటిమీద ఉన్న 16 గ్రాముల బంగారు గొలుసు, పర్సు, బ్లూటూత్ తదితర వస్తువులను లాక్కున్నారు. అనంతరం మత్తులో నుంచి బయటకు వస్తున్న సచిన్ దూబేకు యువతితో ఉన్న నగ్నవీడియోలను చూపించారు. ఈ అమ్మాయి హత్యకు గురయిందని, తాము టాస్క్‌ఫోర్స్ పోలీసులమంటూ బెదిరింపులకు దిగడం ప్రారంభించారు.
“నిన్ను అరెస్ట్ చేస్తున్నామని.. దీన్ని నుంచి తప్పించుకోలేవు.” అరెస్ట్ నుంచి తప్పించుకోవాలంటే రూ.10 లక్షలు ఇంటినుంచి తెప్పించమంటూ ఒత్తిడి చేశారు. దీంతో సచిన్ దూబే తన భార్యకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పాడు. తాను సమస్యల్లో చిక్కుకున్నానని, తనకు అర్జెంట్‌గా రూ.10 లక్షలు ఇవ్వకపోతే హత్యకేసులో అరెస్ట్ అవుతానంటూ చెప్పాడు. దీంతో తనవద్ద డబ్బులు లేవని, అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి అంటూ ఆమె సమాధానం ఇచ్చింది.
దీంతో లాభం లేదని భావించిన నలుగురు నిందితులు జరిగిన విషయం ఎవరికైనా చెబితే అంతుచూస్తామని బెదిరించి ..అతడి సెల్‌ఫోన్ నుంచి ఓలా ఆటో బుక్ చేసి అత్తాపూర్‌లోని ఇంటికి పంపించారు. తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకున్న సచిన్ దూబే జరిగిన విషయాన్ని భార్యకు చెప్పాడు. తన ఫోన్లో నగ్నవీడియోలు ఉండడం, తాను మత్తులో ఉండడంతో నిజంగానే హత్య జరిగి ఉండవచ్చని భావించారు.
విచారణలో బయటపడిన స్కెచ్..
పబ్‌కు వెళ్లిన తనను కిడ్నాప్ చేసిన వ్యవహారంపై తెలిసినవారికి చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో ఈ నెల 26న సచిన్‌దూబే బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా కూకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్‌లో పనిచేస్తున్న డింపుల్ యాదవ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తం స్కెచ్ బయట పడింది. గతంలో బౌన్సర్‌గా పనిచేసిన భర్త పవన్‌కుమార్ యాదవ్(32)తో కలిసి డబ్బులు గుంజేందుకు డింపుల్ యాదవ్ స్కెచ్ వేసినట్లు తేలింది.
పవన్‌కుమార్ యాదవ్ స్నేహితులైన సాయిప్రసాద్, హరికిషన్, సుబ్బారావు అనే వ్యక్తులను పిలిపించి పబ్‌నుంచి మద్యం మత్తులో బయలుదేరిన సచిన్ దూబేను కిడ్నాప్ చేయడం.. అనంతరం గుర్తుతెలియని యువతితో నగ్నవీడియోలు చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేయడం, కుటుంబసభ్యులు డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో అతడి ఒంటిపై ఉన్న బంగారంతో పాటు ఇతర వస్తువులను కాజేసినట్లు తేలింది.
ఆభరణాల షాపు నిర్వాహకుడిగా సచిన్‌దూబే చెప్పుకోవడంతో ఆయన వద్దనుంచి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజేందుకు డింపుల్ యాదవ్‌తో పాటు ఆమె భర్త పవన్‌కుమార్ యాదవ్ పక్కా ప్రణాళిక వేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితులు పవన్ కుమార్ యాదవ్, డింపుల్ యాదవ్, సాయిప్రసాద్, హరికిషన్,సుబ్బారావులను గురువారం అరెస్ట్ చేసిన రిమాండ్‌కు తరలించారు. కిడ్నాప్‌నకు ఉపయోగించిన ఫార్చూనర్ కారు, డింపుల్ వాడిన యాక్టివా బైక్‌ను, పవన్‌కుమార్ యాదవ్‌కు చెందిన బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.