బంజారాహిల్స్, మే 13 : ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టుకున్న జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్‌లోని బసవతారకం నగర్ బస్తీకి చెందిన ఓర్సు శ్రీను, వినోద దంపతులకు శనివారం ఫిలింనగర్లో జరిగిన కార్యక్రమంలోఎమ్మెల్యే దానం నాగేందర్ జీవో 58 కింద పట్టా పంపిణీ చేశారు.
అయితే తమ పెళ్లి రోజున 62 గజాల ఇంటిపై యాజమాన్య హక్కు లభించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఓర్సు శ్రీను దంపతులు ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు ఆనందంగా చెప్పారు. దీంతో వారిని ప్రత్యేకంగా సత్కరించారు. తనకు జీవితంలో మరుపురాని కానుకను ముఖ్యమంత్రి కేసీఆర్ అందించారని ఓర్సు శ్రీను తెలిపారు.