హిమాయత్‌నగర్,ఆగస్టు10 : ఇంటి ముందు పార్కు చేసిన ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసిన ఓ యువకుడిని నారాయణగూడ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. డీఎస్సై చందర్‌సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. కర్నాటక రాష్ట్రం బీదర్‌కు చెందిన మహేష్(24) జీవనోపాధి కోసం నగరానికి వచ్చి ఎస్ఆర్నగర్లో ఉంటూ ఓ హోటల్లో పనిచేస్తున్నాడు.
కింగ్ కోఠికి చెందిన సయ్యద్ యాసీన్ బైక్‌ను మే 29న దొంగిలించుకుని పారిపోయాడు. మరుసటి రోజు ఉదయం పార్కు చేసిన వాహనం కన్పించకపోవడంతో బాధితుడు సయ్యద్ యాసీన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అక్కడి సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించి బైక్ చోరీ చేసిన నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఎస్ఆర్నగర్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించి మంగళవారం మహేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. లాక్డౌన్ కారణంగా రవాణా సౌకర్యం లేకపోవడంతో తాను బైక్ చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. అతడి నుంచి బైక్ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్సై చందర్‌సింగ్ తెలిపారు.