నగరంలో గురువారం ఓ జింక జనావాసాల్లోకి ప్రవేశించింది. అసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడిమల్కాపూర్ సాయిబాబా గుడి సమీపంలోని ఇంట్లోకి ఎక్కడి నుంచో ఓ జింక వచ్చింది. దీనిని గమనించిన స్థానికులు పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ జింకను ఆధీనంలోకి తీసుకొని వెంటనే జూ పార్క్ అధికారులకు అప్పగించారు.
– మెహిదిపట్నం ఫిబ్రవరి 27: