సిటీబ్యూరో: ఘట్కేసర్ పోచారంలో నివాసముండే ఓ యువతి మ్యాట్రీమోనియల్.కామ్ (matrimonial.com) అనే వెబ్సైట్లో తన ప్రొపైల్‌ను అప్లోడ్ చేసింది. ‘నా పేరు సూర్య పర్వతనేని.. అంటూ.. తనకు వివిధ రకాల వ్యాపారాలున్నాయని, రూ. 10 వేల కోట్ల వరకు తనకు ఆస్తులున్నాయంటూ ఓ వ్యక్తి పరిచయం చేసుకొని..స్నేహం చేశాడు.
‘పెండ్లి చేసుకుంటానని చెప్పాడు. వివిధ కారణాలు చెబుతూ.. మొత్తం 86 లక్షలు వసూలు చేశాడు. బాధితురాలు సూర్య పర్వతనేని ఎవరు అని ఆమె గూగుల్‌లో ఆరా తీయడంతో ఈ పేరుతో ఉన్న వ్యక్తి గతంలోనూ ఇలాంటి మోసాలు చేశాడని, అతడో చీటర్ అని గుర్తించి వెంటనే రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.