బడంగ్‌పేట, జనవరి12: రౌడీషీటర్ ముబారక్ సిగర్‌ను దారుణంగా హత్య చేసిన ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి తెలిపారు. ఎస్వోటీ డీసీ మురళీధర్, మహేశ్వరం అడిషనల్ డీసీపీ సత్యనారాయణతో కలిసి డీసీపీ సునీతా రెడ్డి వివరాలు వెల్లడించారు. బాలాపూర్ మండల పరిధిలోని కొత్తపేట అబుబాకర్ కాలనీకి చెందిన ముబారక్ బీన్ అబ్దుల్లా అలియాస్ ముబారక్ సిగార్‌పై 23 కేసులు ఉన్నట్లు తెలిపారు. క్యూబాకాలనీకి చెందిన రౌడీషీటర్ షేక్ ఇస్మాయిల్ అలియాస్ అదిల్ పాతనేరస్తుడు.
రౌడీషీటర్ షేక్ అమీర్ అలియాస్ షా సహెబ్ అలియాస్ ఇబ్రహీం, మహుమ్మద్ సయ్యద్ అలియాస్ నసీర్ పై రెండు కేసులు ఉన్నాయి. అదే ప్రాంతానికి చెందిన షేక్ హుసేన్, అబ్దుల్ ఫరీద్ ఖాన్, సయ్యద్ ఖాజా, సయ్యద్ ఇలియాస్, మహుమ్మద్ సమీర్ స్నేహితులు. ముబారక్ సిగర్ వద్ద రెండు మొబైల్ ఫోన్లను ,నగదును తీసుకున్నారు. దీంతో ముబారక్ సిగార్ అడగడంతో హత్య చేయాలని అనుకున్నారు. ఈనెల 10న అర్ధరాత్రి ముబారక్ సిగర్ వాదేయే ముస్తాఫాకు చేరుకోగా అదే సమయంలో షేక్ ఇస్మాయిల్ , షేక్ అమీర్, మహుమ్మద్ సయ్యద్, షేక్ హుస్సేన్, అబ్దుల్ ఫరీద్ ఖాన్, సయ్యద్ ఖాజా, సయ్యద్ ఇలియాస్, మహుమ్మద్ సమీర్ గొడవకు దిగి ముబారక్ సిగార్‌ను విచక్షణ రహితంగా దాడి చేసి హత్య చేశారు. ఎనిమిది మందిని బాలాపూర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.