అమీర్‌పేట్, అక్టోబర్ 5 : నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దినపత్రికల ఆధ్వర్యంలో కొనసాగుతున్న దసరా బొనాంజా నాలుగో రోజు అమీర్‌పేట్ కేఎల్ఎం షాపింగ్ మాల్లో పండుగ షాపింగ్ ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. కొనుగోలుదారులతో కలిసి మంగళవారం సాయంత్రం నిర్వహించిన డ్రా ఆద్యంతం పండుగ వాతావరణంలో సాగింది. నమస్తే తెలంగాణ చీఫ్ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి, కేఎల్ఎం షాపింగ్ మాల్స్ ఆపరేషన్స్ హెడ్ సీవీ రావు, స్టోర్స్ మేనేజర్ ప్రదీప్, నమస్తే తెలంగాణ యాడ్స్ జీఎం సురేందర్రావుతో కలిసి నిర్వహించిన డ్రాలో కొనుగోలుదారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కొనుగోలుదారులతోనే లక్కీ డ్రా తీయించడంతో వారి ఆనందానికి అవధుల్లేవు.
ఈ బొనాంజాలో మొదటి బహుమతిగా 32 ఇంచుల టీవీని ఎల్బీనగర్కు చెందిన కోట మాన్విత ( పీఎంఆర్ లా కళాశాల, ఎల్బినగర్ (నెంబర్ : 023506, ఫోన్ : 7702533681)) గెలుచుకున్నారు. ద్వితీయ బహుమతి సెల్‌ఫోన్‌ను మోజంజాహి మార్కెట్‌కు చెందిన ‘నీలగిరి టీ’కి చెందిన అనీస్ అహ్మద్ (నెంబర్ : 033002 ఫోన్ : 9849067795) గెలుచుకున్నారు. తృతీయ బహుమతిని (గిఫ్ట్ వోచర్) సహన (కేఎల్ఎం, కూకట్పల్లి, నెంబర్ : 030242 ఫోన్ : 9908880057), నాలుగో బహుమతిని (గిఫ్ట్ హాంపర్) కార్తీక్, దిల్సుఖ్నగర్ రామయ్య కోచింగ్ సెంటర్ (నెంబర్ : 024167 ఫోన్ : 9705364903), ఐదో బహుమతిని (గిఫ్ట్ హాంపర్) వైష్ణవి, పీఎంఆర్ లా కళాశాల (నెంబర్ : 024036 ఫోన్ : 8106789615) గెలుచుకున్నారు.
నమస్తే తెలంగాణతో కలిసి నిర్వహిస్తున్న బంపర్ బొనాంజాతో కేఎల్ఎం షాపింగ్ మాల్లో పండుగ వాతావరణం నెలకొంది. కేఎల్ఎంలో అందుబాటులో ఉన్న డబుల్ ధమాకాతో పాటు మంగళవారం నాటి బంపర్ డ్రాతో కొనుగోలుదారుల్లో ఉత్సాహం పెరిగింది. ఇంత చక్కటి కార్యక్రమానికి కేఎల్ఎం అమీర్‌పేట్ మాల్ వేదిక కావడం ఆనందంగా ఉంది. – సీ.వీ.రావు, ఆపరేషన్స్ హెడ్, కేఎల్ఎన్ షాపింగ్ మాల్స్
పండుగలకు కటుంబసమేతంగా షాపింగ్ చేయాల్సి వస్తే అది కేఎల్ఎం ఫ్యాషన్ మాల్నే ఎంచుకుంటాం. ఇక్కడ నాణ్యమైన దుస్తులు సరసమైన ధరలు ఉంటాయి. పండుగ సమయాల్లో ఇచ్చే ప్రత్యేక డిస్కౌంట్లు ఆకర్షణీయంగా ఉండడంతో శక్తికి మించి కొనుగోలు చేస్తున్నామనే భయం లేకుండా నిండు మనసుతో షాపింగ్ చేస్తున్నాం.- ప్రసన్న, యూసుఫ్‌గూడ