శంషాబాద్ రూరల్, అక్టోబర్ 28 : మొంథా తుఫాన్ ప్రభావం కారణంగా శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి విజయవాడ, విశాఖపట్నం,రాజమండ్రి వెళ్లాల్సిన విమానాలు రద్దు చేసినట్లు జీఎంఆర్ ఎయిర్పోర్టు అధికారులు మంగళవారం తెలిపారు. వాతావరణం అనుకూలించక పోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఆంధ్ర ప్రదేశ్తో పాటు పలు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురువడంతో మొత్తం 35 విమాన సర్వీసులు రద్దు చేశామన్నారు. విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రికి వెళ్లాల్సిన విమానాలతో పాటు అక్కడి నుంచి రావాల్సిన విమానాలు కూడా రద్దు చేశామని వివరించారు.