సిటీబ్యూరో, జనవరి 14 (నమస్తే తెలంగాణ): సైక్లింగ్ ప్రోత్సహించడమే లక్ష్యంగా హైదరాబాద్ సైక్లిస్ట్సు గ్రూప్ ఆధ్వర్యంలో వంద రోజుల సైక్లింగ్ చాలెంజ్ కార్యక్రమానికి నగర సైక్లిస్టుల నుంచి అనూహ్య స్పందన వస్తుందని ఆ సంస్థ ఫౌండర్ నందనూరి రవీందర్ ఆదివారం పేర్కొన్నారు.
ప్రతీ రోజు ఐదు కిలో మీటర్లకు మించకుండా సైక్లింగ్ చేస్తూ స్ట్రావా యాప్లో సమయం నిక్షిప్తం చేసి వివరాలు పంపిస్తున్నారని తెలిపారు. ఈ ఛాలెంజ్ ఏప్రిల్ 16 వరకు కొనసాగుతుందని వివరించారు.