LB Nagar | ఎల్బీనగర్, జూలై 2 : ఎల్బీనగర్ సర్కిల్ కార్యాలయంలో ఎండకు ఎండుతు, వానకు తడుస్తు నిరుపయోగంగా పడి ఉన్న మూడు చక్రాల సైకిళ్ళు దర్శనం ఇస్తున్నాయి. నిత్యం అధికారులు కార్యాలయానికి వచ్చి వెళ్తున్నా వీటిని పట్టించుకోవడం లేదు. వేలాధి రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన ముడు చక్రాల సైకిళ్ళు వర్షంలో తడిసి పాడైపోతున్నాయి. కనీసం వాటిని దివ్యాంగులకు పంపిణీ చేసి ఉపయోగంలోకి తేవాలని, లేకుంటే వాటిని సరైన చోట భద్రపరచాలని పలువురు కోరుతున్నారు. ప్రజాధనంతో కొన్న ముడు చక్రాల సైకిళ్లను వృధాగా బయట పడవేసి అధికారులు చేతులు దులుపుకోవడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.