ఆకాశం.. సైకిల్ ప్రయాణం

- సమూహ ప్రయాణాలకు దూరం
- వందల కిలోమీటర్లు ద్విచక్ర వాహనంపైనే
- ఒంటరి ప్రయాణానికే మొగ్గు
- వైరస్ల భయంతో మారిన ధోరణి
వైరస్ల బారిన పడకుండా ఉండాలంటే సోలో ప్రయాణాలే శ్రేయస్కరమని అభిప్రాయపడుతున్నారు నగరవాసులు. అందుకోసం ద్విచక్ర వాహనాలను ఎంచుకుంటున్నారు. వందల కిలోమీటర్ల గమ్యానికి సైతం బైక్ జర్నీ చేస్తున్నారు. సమూహ ప్రయాణాలు జోలికిపోవడం లేదు. కొవిడ్, స్ట్రెయిన్లాంటి వాటికి చిక్కకుండా ఉండాలంటే భౌతికదూరం పాటించాల్సిందే. వైరస్ వ్యాప్తికి కారణమయ్యే సమూహ ప్రయాణాలు డేంజర్‌గా భావిస్తున్నారు. రిస్క్ తీసుకుని మరీ బైక్ జర్నీ చేస్తున్నారు. స్కై సైక్లింగ్.. ఇప్పుడు నగరంలో క్రేజ్ పొందుతున్నది. వీకెండ్స్‌లో యువతీ యువకులు ఆకాశంలో సైకిల్ ప్రయాణంతో ఎంజాయ్ చేస్తున్నారు. నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ప్లాజా వద్ద పిట్‌స్టాప్‌లో ఏర్పాటు చేసిన స్కై సైక్లింగ్, జిప్‌లైన్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
“ఆదిలాబాద్‌కు చెందిన సిద్ధార్థ ఐటీ ఉద్యోగి. వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడు. కంపెనీ పనుల మీద వారానికి ఒక్కసారైన హైదరాబాద్‌కు రావాల్సి ఉంటుంది. అయితే సాఫీగా బస్సు, రైలులో రావొచ్చు. కానీ కొత్త వైరస్ భయం కారణంగా సమూహ ప్రయాణానికి విముఖత చూపి తన బైక్ మీదే నగరానికి వచ్చిపోతున్నాడు. వందల కిలోమీటర్ల జర్నీ సేఫ్ కాదేమోనని అతడిని ప్రశ్నిస్తే.. రిస్క్ ఉన్నా.. ఫ్యామిలీ ఆరోగ్యం దృష్ట్యా తప్పదంటున్నాడు అతడు.”
సిద్దిపేటకు చెందిన స్వాతి తన స్కూటీ మీద నగరానికి వచ్చిపోతుంది. అనవసరంగా సమూహ జర్నీ చేసి వైరస్ బారిన పడితే కుటుంబమంతా చిన్నాభిన్నం అవుతుందని చెబుతుంది. ఇంటి నుంచి నేరుగా ఆఫీసుకు వెళ్లి పని పూర్తయ్యాక ఇంటికి చేరుకుంటాం. అదే బస్సు, రైలు, టాక్సీ ప్రయాణాలు అయితే చాలా మంది తెలియని వాళ్లతో ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. అది ప్రమాదకరం. అందుకే సోలో జర్నీయే బెటర్ అని తెలిపింది.
భౌతికదూరమే బెటర్
మాది నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్‌లోని కొండారెడ్డిపల్లి. సెలవుల్లో ఇంటికి వెళ్లేందుకు బస్సు, రైలులో ప్రయాణించాలంటే భయమేస్తుంది. సమూహ ప్రయాణం చేసి ఇంటికి వెళ్లిన తర్వాత హ్యాపీగా ఉండలేం. అందుకే రిస్క్ అయినా బైక్ జర్నీయే బెటర్‌గా భావిస్తాను. మా తల్లిదండ్రులు బస్సుకు రమ్మని చెబుతారు.. కానీ పరిస్థితులు అలా లేవు. సాధ్యమైనంత వరకు జనాలకు దూరంగా ఉండటమే మంచిది.
స్ట్రెయిన్ టెర్రర్..!
ఇప్పుడిప్పుడే కరోనా నుంచి తేరుకుంటున్న పరిస్థితుల్లో కొత్తగా కరోనా స్ట్రెయిన్ ప్రజల్లో భయాన్ని రేపింది. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్‌లో నివాసముంటున్న వారు, వివిధ కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్నవారు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే వర్క్‌ఫ్రం హోం చేస్తున్న ఐటీ ఉద్యోగులు సొంతూళ్లలో ఉన్నారు. కంపెనీ పనుల మీద వారానికి ఒక్కసారైన నగరానికి రావాల్సి ఉండటంతో ద్విచక్రవాహన ప్రయాణాన్ని ఎంచుకుంటున్నారు. బస్సు, రైలులో ప్రయాణించడానికి విముఖత చూపుతున్నారు.
ప్రతి పది రోజులకోసారి ఆఫీసుకు..
నేను ఓ కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్‌గా పనిచేస్తున్నా. ఆరు నెలలుగా ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నా. పది రోజులకోసారి ఆఫీసుకు రావాల్సి ఉంటుంది. మంచిర్యాల నుంచి హైదరాబాద్‌కు సుమారు 250కిలోమీటర్లు బైక్‌పైనే వస్తుంటాను. ఐదు గంటల జర్నీ. కష్టంగానే ఉంటుంది. కానీ తప్పదు. సమూహ ప్రయాణంతో అనారోగ్యానికి గురైతే ఆ ప్రభావం ఫ్యామీలీపై పడుతుంది. ఆ బాధకన్నా నేను రిస్క్ తీసుకోవడమే మేలని నా అభిప్రాయం. - ప్రకాశ్ రెడ్డి, ఐటీ ఉద్యోగి.
- ప్రకృతిలో జాలీ రైడ్
- స్కై సైక్లింగ్, జిప్‌లైన్ ఏర్పాటు
- ఆస్వాదిస్తున్న భాగ్యనగరవాసులు
నీలి మబ్బుల నింగి.. ఆకుపచ్చని నేల.. పక్షుల పలకరింపులు..హోయలొలికే చల్లని గాలి.. ప్రకృతిని ఆస్వాదిస్తూ.. నేలకు, నింగికి మధ్యలో గాలిలో తేలుతూ.. తీగపై సైకిల్ సవారీ.. ఊహించుకుంటేనే ఒళ్లు పులకరిస్తుంది కదా. ఇదంతా విదేశాల్లో అనుకుంటున్నారా? కాదండీ మన దేశంలోనే.. కాదు కాదు.. మన రాష్ట్రంలోనే.. ఇంకా చెప్పాలంటే మన హైదరాబాదులోనే ఉంది. తీగపై సైకిల్ సవారీ ఏంటీ? అదీ మన సిటీలో ఎక్కడా అని అనుకుంటున్నారా..! పూర్తి కథనం చదివితే మీకే తెలుస్తుంది.
సందర్శకుల తాకిడి ఎక్కువే..
కేరళ రాష్ట్రం వయానడ్ జిల్లాలోని హిల్ స్టేషన్లో ఈ అడ్వెంచర్ గేమ్‌ను చూసి స్ఫూర్తి పొందాను. ఇలాంటిది హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని సంకల్పించాను. పిట్‌స్టాప్‌లో ఇప్పటికే గో కార్టింగ్, ఇతర క్రీడలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. లాక్డౌన్ ముగిసిన తర్వాత స్కై సైక్లింగ్, జిప్ లైన్లను ఏర్పాటు చేశాం. కొద్దిరోజులకే విశేష స్పందన వచ్చింది. స్కై సైక్లింగ్‌కు రూ.200, జిప్‌లైన్‌కు రూ.150 నామమాత్రపు ఫీజులు వసూలు చేస్తున్నాం. చిన్నారుల కోసం సురక్షిత చర్యలతో చిన్నపాటి జిప్‌లైన్ కూడా ఏర్పాటు చేశాం. శని, ఆదివారాల్లో సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. - పీఎస్ ప్రసాద్, కేర్‌టేకర్
స్కై సైక్లింగ్.. విదేశాలకే పరిమితమైన ఈ సాహస క్రీడ. భారతదేశంలో మొట్ట మొదటిసారి హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని కులు జిల్లాలో ఏర్పాటు చేశారు. అలా పర్యాటకులను ఆకర్షించిన ఈ సాహస క్రీడ మన రాష్ర్టానికీ చేరుకుంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని మయూరీ హరితవనంలో స్కై సైక్లింగ్‌ను ప్రారంభించారు. పర్వత ప్రాంతాలు, అడవులు, జాతీయ పార్కులకే పరిమితమైన ఈ అద్భుత అడ్వెంచర్ గేమ్‌ను హైదరాబాద్ వాసులకు పరిచయం చేస్తూ నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా వద్ద పిట్‌స్టాప్‌లో ఏర్పాటు చేశారు. పరిచయం లేని ఈ క్రీడను నగరవాసులు ఆస్వాదిస్తూ ఆనందడోళికల్లో మునిగి తేలుతున్నారు.
40 అడుగుల ఎత్తులో 300 మీటర్లు..
స్కై సైక్లింగ్ అంటేనే ఆకాశవీధుల్లో సరదాగా విహరించడం. రూ.30లక్షల వ్యయంతో పిట్‌స్టాప్‌లో ఏర్పాటు చేసిన ఈ స్కై సైక్లింగ్ కోసం 40 అడుగుల ఎత్తయిన జంట టవర్లు నిర్మించారు. రెండు టవర్లకు మధ్య దూరం సుమారు 300 మీటర్లు. ప్రస్తుతం ఇక్కడ ఇద్దరు రైడర్లు ఒకేసారి విహరించేందుకు రెండు దృఢమైన తీగలను ఏర్పాటు చేశారు. ఈ గట్టు నుంచి ఆ గట్టుకు వెళ్లేందుకు సగటున ఐదు నుంచి ఏడు నిమిషాల వ్యవధి పడుతుంది.
తొమ్మిదేళ్లు ఆపైన..
స్కై సిక్లింగ్లో పాల్గొనే వారికి కనీసం తొమ్మిదేండ్ల వయోపరిమితి విధించారు. 28 కేజీల నుంచి 90 కేజీల బరువులోపు ఉన్న వారు మాత్రమే ఈ క్రీడలో పాల్గొనవచ్చు. సైక్లింగ్‌కు వెళ్లే వారికి ప్రత్యేకంగా రూపొందించిన హెల్మెట్, గ్లౌస్, కంటి అద్దాలను అందిస్తారు. తీగలపై నడిచే సైకిల్‌ను బ్యాలెన్స్ చేసేందుకు తాళ్లు...సేఫ్టీ లాక్‌లు ఉంటాయి.
అదనంగా జిప్ లైన్..
స్కై సైకిల్‌తోపాటు పర్వతారోహణంపై ఆసక్తి ఉన్న వారి కోసం జిప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. సినిమాల్లోని సన్నివేశాల్లోనే ఎక్కువగా కనిపిస్తుందీ సాహస క్రీడ. ఓ తీగకు చువ్వ బిగించి వేలాడుతూ కనిపిస్తుంటారు నటులు. పర్వత ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే ఈ సాహస క్రీడనూ పిట్‌స్టాప్‌లో ఆస్వాదించవచ్చు. స్కై సైక్లింగ్‌కు అనుసంధానంగా రెండు ప్రత్యేక జిప్ లైన్లు ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
- ఆ దేశంలో మళ్లీ పెరిగిన ఆత్మహత్యలు
- టీమిండియాను చూసి నేర్చుకోండి
- డయాగ్నొస్టిక్ సెంటర్లలో ఈసీజీ, అల్ట్రాసౌండ్: మంత్రి ఈటల
- భారీ మల్టీ స్టారర్‌కు ప్లాన్ చేస్తున్న శంకర్..!
- పట్టణ పేదలకు మెరుగైన వైద్య సేవలు : మంత్రి కేటీఆర్
- కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభం
- పోలీస్ అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ అందిస్తా : మంత్రి హరీశ్‌రావు
- సగం ఉడికిన గుడ్లు తినకండి..
- మావాడు లెజెండ్ అవుతాడు: సుందర్ తండ్రి
- 'తాండవ్' వెబ్ సిరీస్‌కు వ్యతిరేకంగా గాడిదలతో నిరసన