సిటీబ్యూరో, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): ఏఐతోఒక నకిలీ వీడియో తయారు చేసి రూ. 22 లక్షలు బురిడీ కొట్టించారు సైబర్‌నేరగాళ్లు. సోషల్‌మీడియాలో బాధితుడు ఒక వీడియోను చూశాడు, యూనియన్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ మాట్లాడినట్లు, స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టండంటూ సూచన చేస్తున్నట్లు ఉంది. అందులో ఎక్స్వెంటర్ అనే ఒక ప్లాట్‌ఫామ్ గురించి వివరించారు.
ఆ వీడియోలో ఉన్న లింక్‌ను క్లిక్ చేయడంతో ఎక్స్వెంటర్ నుంచి బాధితుడి వాట్సాప్ నంబర్‌కు ఒక మేసేజ్ వచ్చింది. ఆ తరువాత తాను సదరు ఎక్స్వెంటర్ సంస్థ ప్రతినిధినంటూ మాట్లాడుతూ తాము చెప్పినట్లు మీరు పెట్టుబడులు పెడితే మంచి లాభాలొస్తాయంటూ నమ్మించారు. బాధితుడి ఫిర్యాదు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.