సిటీబ్యూరో: ఎస్బీఐ అకౌంట్ ఆధార్ అప్డేట్ చేసుకోవాలంటూ ఏపీకే ఫైల్ పంపిన సైబర్ నేరగాళ్లు ఓ వ్యాపారి ఖాతాలో నుంచి రూ. 7.39 లక్షలు కాజేశారు. హస్తినాపురానికి చెందిన బాధితుడిని మీ యూనో ఎస్బీఐ ఆధార్ అప్డేట్ చేసుకోవాలని లేదంటే మీ అకౌంట్ బ్లాక్ అవుతుందంటూ మెసేజ్ పంపించారు.
యూనో ఎస్బీఐ ఆధార్ అప్డేట్.ఏపీకే అనే పేరుతో వచ్చిన లింక్‌ను క్లిక్ చేయండంటూ సూచించారు. బాధితుడు ఆ లింక్‌ను క్లిక్ చేసి వివరాలు పొందుపరిచాడు. అయితే మరుసటి రోజు బ్యాంకు ఖాతాలో నుంచి రూ. 7.39 లక్షలు ఖాళీ అయ్యాయి. ఈ మేరకు బాధితుడు మల్కాజిగిరి సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.