బంజారాహిల్స్,ఏప్రిల్ 17: పార్ట్‌టైమ్ జాబ్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటన ఇచ్చి సైబర్ మోసానికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బంజారాహిల్స్ రోడ్ నెం 14లోని నందినగర్‌లోని నౌషా బార్ అండ్ కిచెన్ రెస్టారెంట్లో మేనేజర్‌గా పనిచేస్తున్న గాజుల వెంకటేష్ ఇన్స్టాగ్రామ్ చూస్తుండగా పార్ట్ టైం జాబ్ కావాలా.. అంటూ ఓ ప్రకటన కనిపించింది. ఈ ప్రకటనలోని లింక్‌ను చూడగా వాట్సప్‌లో వివరాలు పంపించారు.
ఆన్లైన్లో ప్రొడక్ట్స్ కొనుగోలు చేయడంతో పాటు కమిషన్ పొందవచ్చని తెలిపారు. వారి మాటలను నమ్మిన వెంకటేష్ ఐదారు సార్లు డబ్బులు పెట్టి ప్రొడక్ట్స్ కొనుగోలు చేయడం, వాటిమీద కమిషన్ పొందడం చేశారు. కొంతనమ్మకం ఏర్పడిన తర్వాత రూ.75,900 తన ట్రేడింగ్ అకౌంట్లో వేయగానే సైబర్ నేరగాళ్లు వెంకటేష్ అకౌంట్ ఫ్రీజ్ చేశారు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు గురువారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.